Home / ANDHRAPRADESH / చంద్రబాబు పరువును నడిబజారున పడేసిన ఏపీ బీజేపీ నేత..!

చంద్రబాబు పరువును నడిబజారున పడేసిన ఏపీ బీజేపీ నేత..!

టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ బీజేపీతో దోస్తాన కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. 2014 లో మోదీ హవాలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాలుగేళ్లపాటు ఎన్డీయేతో అంటకాగి, ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీకి జై కొట్టాడు. ప్రజల్లో నాటి ప్రతిపక్ష నేత జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి బెంబేలెత్తిన చంద్రబాబు..సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు ఎన్డీయే నుంచి బయటకు వచ్చి మోదీని, జగన్‌ను కలిపి టార్గెట్ చేశాడు. సిగ్గు, లజ్జ లేని వ్యక్తి , అబద్దాల కోరు అని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశాడు. భార్య ఉన్నా, లేనట్లు నటించేవాడిని ఏమనాలి..తల్లిని చూడరు..భార్యను చూడరు..నాకు ఓ భార్య, కొడుకు, కోడలు, మనవడు ఉన్నాడు..మరి మోదీసంగతేంటూ..వ్యక్తిగతంగా దిగజారుడు విమర్శలు చేశాడు. అంతే కాదు దేశం మొత్తం తిరిగి రాహుల్ , సోనియాలతో కలిసి, అన్ని పార్టీలను ఏకం చేసి, మోదీ మెడలు వంచుతా, మళ్లీ ప్రధాని ఎలా అవుతాడో చూస్తా అంటూ డైలాగులు వేశాడు. ఇక ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షలు అంటూ..డ్రామా దీక్షలు చేపట్టి దివ్యవాణి వంటి ఆర్టిస్టులతో మోదీని పచ్చిబూతులు తిట్టించాడు. ఇక విజయవాడ ధర్మపోరాట దీక్షలో తన బామ్మర్ది హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య వచ్చీరాని హిందీలో నమక్ హరామ్..అంటూ బూతులు తిడుతుంటే చంద్రబాబు ముసిముసినవ్వులు నవ్వాడు. ఆఖరకు గల్లాజయ్‌దేవ్‌తో కూడా మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ వ్యంగంగా తిట్టించాడు. ప్రజల్లో సెంటిమెంట్‌ను రగిలించి మోదీనీ ముద్దాయిగా నిలబెట్టి, జగన్‌కు, మోదీ ఒకటే అని ప్రచారం చేసి తాను మళ్లీ గట్టెక్కాలని భావించిన చంద్రబాబు ప్లాన్ వర్కవుట్ కాలేదు..కేంద్రంలో మోదీ మళ్లీ అధికారంలోకి వచ్చాడు. ఏపీలో జగన్ అఖండ విజయం సాధించాడు. చంద్రబాబుకు చరిత్రలో ఎన్నడూ లేనంతగా ప్రజలు బుద్ధి చెప్పారు. గత ఐదేళ్లలో జరిగిన అవినీతిపై సీఎం జగన్ విచారణ జరిపిస్తుండడంతో చంద్రబాబులో గుబులు మొదలైంది. అందుకే ముందు జాగ్రత్తగా తనకు సన్నిహితులైన నలుగురు ఎంపీలను బీజేపీలోకి పంపించించిన చంద్రబాబు వారి సహకారంతో మళ్లీ మోదీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకే మొన్న విశాఖలో పార్టీ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రజల కోసం విబేధించామే తప్ప, మోదీతో వ్యక్తిగత వైరం లేదని చెప్పుకున్నాడు. మళ్లీ మోదీతో కలిసే పని చేసేందుకు సిద్ధం అనేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేశాడు. బీజేపీతో మళ్లీ దోస్తానకు ప్రయత్నిస్తున్న చంద్రబాబుపై బీజేపీ నేత సోమువీర్రాజు ఘాటుగా స్పందించారు. ఢిల్లీ దీక్షల్లో మోదీ మెడలు వంచుతామని నిజం కాదా…గల్లాజయదేవ్, బాలయ్య వంటి నేతలతో మోదీని తిట్టించలేదా అని బాబుపై వీర్రాజు మండిపడ్డారు. అమరావతి రాజధాని శంకుస్థాపనకు మోడీ పవిత్ర జలాలు తెస్తే కించపరిచేలా మాట్లాడిన విషయం బాబుకు గుర్తులేదేమో అని ఎద్దేవా చేశారు. . ప్రస్తుతం ఏపీలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతుందని అందుకే చంద్రబాబు లో భయం మొదలైందని ఆయన అన్నారు. ఏపీలో రోజు రోజుకీ తన పరిస్థితి దిగజారిపోతుండడంతో ఏ దిక్కూలేక చంద్రబాబు మళ్లీ బీజేపీతో దోస్తీకి పడరానిపాట్లు పడుతున్నారంటూ… సోమువీర్రాజు సెటైర్ వేశాడు. మొత్తంగా మోదీకి మళ్లీ దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబు నిజస్వరూపాన్ని ఏపీ బీజేపీ నేతలు వరుసగా బయటపెడుతూ పరువు తీస్తున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat