Home / ANDHRAPRADESH / సీఎంగా ఉన్నా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా జగన్ ట్రాప్ లోనే పడుతున్న చంద్రబాబు.. ఇది అత్యంత ప్రమాదకరం

సీఎంగా ఉన్నా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా జగన్ ట్రాప్ లోనే పడుతున్న చంద్రబాబు.. ఇది అత్యంత ప్రమాదకరం

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన ట్రాప్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి పడ్డారని స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం 40 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడిగా చెప్పుకుంటూ జగన్ ట్రాప్ లో పడ్డారు. అయితే ఇప్పుడు కూడా మరోసారి రాజకీయంగా చంద్రబాబు తనకు తానే రాజకీయ సమాధి కట్టుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి అధికారంలోకి వచ్చాయి. అప్పుడు బీజేపీ, టీడీపీలు ఐక్యతతోనే మెలుగుతూ ఉండేవి. అయితే జగన్ ప్రతిపక్ష నాయకుడిగా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పై ప్రత్యేక హోదా కోసం పోరాటం మొదలు పెట్టగానే చంద్రబాబు దిక్కుతోచని పరిస్థితుల్లో ధర్మ పోరాట దీక్ష పేరుతో పెద్ద ఎత్తున హోదా డిమాండ్ చేశారు. అక్కడితో ఆగకుండా 2019 ఎన్నికలు వచ్చేసరికి బీజేపీపై వైరుధ్యం పెంచుకుని కాంగ్రెస్తో జత కట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి అనేక రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారు. అయితే ప్రస్తుతం 2019 ఎన్నికల్లో బీజేపీకి పెద్దఎత్తున మెజార్టీ రావడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.

దేశంలోని చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది.. అయితే వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాదు మళ్ళీ బీజేపీని అధికారంలోకి వస్తుందని చంద్రబాబు గ్రహించారు.. జగన్ కూడా కేంద్ర ప్రభుత్వం సఖ్యతతో ఉండటంతో చంద్రబాబు కచ్చితంగా మళ్ళీ బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేవలం అధికారం ధ్యేయంగా చంద్రబాబు రాజకీయంగా పావులు కదుపుతున్నారు. గతంలో ఒకసారి జగన్ బీజేపీ పై పోరాటం చేస్తే సంస్థాగతంగా చంద్రబాబు మోడీపై వ్యక్తిగత పోరాటం చేసారు. అది ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పుడు కూడా జగన్ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కోసం పోరాడుతానని చెబుతున్నారు.. రాష్ట్రానికి కావలసిన నిధులు అతి తక్కువ రోజుల్లోనే తీసుకువచ్చారు. అయినా చంద్రబాబు మళ్ళీ బీజేపీతో రాజకీయంగా పొత్తు పెట్టుకుని మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అయితే ఒక సారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు కాదు అన్ని పార్టీలతో రంగులు మార్చే రాజకీయ వ్యభిచారం చేస్తున్న చంద్రబాబుకు ఖచ్చితంగా తెలుగు ప్రజలు మరోసారి ఇంకా గట్టిగా బుద్ధి చెబుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat