Home / SLIDER / సీఎం కేసీఆర్ హుజూర్ నగర్ పర్యటన రద్ధుకు కారణమిదే..!

సీఎం కేసీఆర్ హుజూర్ నగర్ పర్యటన రద్ధుకు కారణమిదే..!

తెలంగాణ ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు గురువారం హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభకు హాజరు కావాల్సి ఉంది. అయితే తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ పర్యటన రద్దయింది .

ఈ పర్యటనలో భాగంగా హెలిక్యాప్టర్ లో వెళ్లేందుకు ఏవియేషన్ శాఖ అనుమతి ఇవ్వలేదు. హూజూర్ నగర్ లో భారీ వర్షం పడటంతో పాటు, మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ సూచనలతో పైలట్ల సూచన మేరకు అనుమతి రద్దు చేసినట్లు ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఒకవైపు ఇప్పటికే హుజూర్ నగర్ పరిసర ప్రాంతాలతో పాటుగా సభ ప్రాంగాణంలో భారీ వర్షం కురవడం గమనార్హం.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat