Home / ANDHRAPRADESH / గ్రామవాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన నారావారు..!

గ్రామవాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన నారావారు..!

ఏపీలో జగన్ సర్కార్ ఒకేసారి లక్షా 34 వేల గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలు, 4 లక్షల గ్రామవాలంటీర్ల ను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. 2014లో బాబువస్తే జాబ్ వస్తుందని మీడియాలో యాడ్స్ గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గత ఐదేళ్లలో యువతకు ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌‌లోనే ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్ విధానం ప్రవేశపెట్టి యువత పొట్టగొట్టాడు. ఈ ఔట్ సోర్సింగ్ విధానం చంద్రబాబు తెచ్చిపెట్టిన దరిద్రం అని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా పలుమార్లు అసహనం వ్యక్తం చేశాడు. ఇక్కడ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తప్పుపట్టడం ఉద్దేశం కాదు కాని..ఔట్ సోర్సింగ్ పేరుతో వేల ప్రభుత్వ ఉద్యోగాలను పూర్తి స్థాయిలో భర్తీ చేయకుండా చేసిన చంద్రబాబు కుట్రలను అర్థం చేసుకోవాలి.. అసలు తన 14 ఏళ్ల పాలనాకాలంలో ఏపీపీఎస్సీ నియామకాలపై బ్యాన్ పెట్టిన ఘనుడు చంద్రబాబు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం బాబుకు సుతరామూ నచ్చని విషయం. కాని ఏపీలో అధికారంలోకి వచ్చిన వైయస్ జగన్ నాలుగునెలల్లోనే లక్షా 34 వేల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను, 4 లక్షల గ్రామవాలంటీర్ల పోస్టులను భర్తీ చేయడాన్ని బాబు జీర్ణించుకోలేపోతున్నాడు. అందుకే గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులపై తరచుగా అక్కసు వెళ్లగక్కుతున్నాడు.గ్రామవాలంటీర్లను బండిపై సరుకులు మోసే కూలీలుగా చిత్రీకరించి తన టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేయించాడు. అంతే కాదు స్వయంగా మగవాళ్లు ఇంట్లో లేనప్పుడు గ్రామవాలంటీర్లు ఇంటి తలుపులు కొడితే ఆడవాళ్ల పరిస్థితి ఏందని లేకి మాటలు మాట్లాడాడు. గ్రామవాలంటీర్లలో మగవాళ్లే కాదు..అంతే సంఖ్యలో ఆడవాళ్లు కూడా ఉన్నారన్న సంగతిని చంద్రబాబు మరిచి మరీ అసభ్యంగా మాట్లాడాడు. ఇక ప్రభుత్వం రికార్డు స్థాయిలో నెలరోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసి, పరీక్షలు నిర్వహించి, వెంటనే రిజల్ట్స్ ప్రకటించి ఉద్యోగాలు అందిస్తే…పేపర్లు లీక్ అయ్యాయంటూ ఎల్లోమీడియాలో దుష్ప్రచారం చేయించాడు. అయితే ఎక్కడా పేపర్ లీక్ అయినట్లు ఎల్లోమీడియా ఛానళ్లు కానీ, పత్రికలు కానీ, చంద్రబాబు కానీ ఆధారాలు చూపలేదు..ఒకవేళ నిజంగా పేపర్ లీక్ అయితే కోర్ట్‌లు సుమోటోగా తీసుకుని కేసులు నమోదు చేసేవి..ఇవన్నీ జరగలేదు కాబట్టి యువతకు ఉద్యోగాలు రావడం ఇష్టం లేకనే చంద్రబాబు పనిగట్టుకుని పేపర్ లీక్ అయినట్లు తన పచ్చ ఛానళ్లలో దుష్ప్రచారం చేయించనట్లు అర్థమవుతోంది. అయితే ప్రభుత్వ తన పనితాను చేసుకుని వెళ్లిపోయింది. యువతకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామసచివాలయాలను ప్రారంభించింది. గ్రామవాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ విధులను చక్కగా నిర్వర్తిస్తున్నారు. కాని చంద్రబాబు మాత్రం ఇంకా జగన్ సర్కార్ యువతకు ఉద్యోగాలు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక పిచ్చిమాటలు మాట్లాడుతూనే ఉన్నాడు. తాజాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ఇన్ని ఉద్యోగాలు ఎవరు ఇమ్మన్నారు అంటూ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్రించాడు. అయ్యా చంద్రబాబు విభజన తర్వాత రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే నువ్వు సొంత విమానంలో వందల కోట్లు ఖర్చుపెట్టి విదేశాలకు వెళ్లి జల్సా చేశావు…ఆ డబ్బుతో కొన్ని వందల ఉద్యోగాలు ఇవ్వచ్చు..అయినా నీ ఐదేళ్ల హయాంలో యువతకు ఒక్క జాబ్ ఇవ్వలేదు..పైగా అధికారంలోకి వస్తే నెలకు రూ. 2000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి..సరిగ్గా మళ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు అదీ కొంత మందికే వెయ్యిరూపాయలు ముష్టి విదిల్చావు. అవి కూడా మీ టీడీపీ కార్యకర్తలే నొక్కేసారు అని యువత ప్రశ్నిస్తోంది. అయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే ఎక్కడైనా ఉద్యోగాలు ఇవ్వకూడదని రూల్ ఉందా..14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశావు..ఏం మాట్లాడుతున్నావు..నువ్వు ఐదేళ్లు ఒక్క ఉద్యోగం ఇవ్వలేకపోయావు..ఇప్పుడు జగన్ లక్షల ఉద్యోగాలు ఇస్తే కడుపు మండిపోయి లేకిమాటలు మాట్లాడుతున్నావు..నువ్వు మనిషివేనా చంద్రబాబు అంటూ ఏపీ యువత మండిపడుతోంది. మొత్తంగా జగన్ సర్కార్ ఉద్యోగాలు యువతకు ఉద్యోగాలు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్న చంద్రబాబు హుందాని మరచి లేకిమాటలు మాట్లాడుతూ..తన స్థాయిని తగ్గించుకుంటున్నాడే చెప్పాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat