Home / MOVIES / అమితాబ్ కు అనారోగ్యం

అమితాబ్ కు అనారోగ్యం

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. నానావతీ ఆసుపత్రిలో ఆయన జాయిన్ అయ్యారు. కానీ చాలా ఆలస్యంగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం ఐసీయూ లాంటి ప్రత్యేక గదిలో ఉన్నా కానీ అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కాగా ఆయన కుటుంబ సభ్యులు నిత్యం అమితాబ్ ను చూడటానికి ఆసుపత్రికెళ్ళడంతో ఈ విషయం కాస్త బయటకు వచ్చింది.

దాదాపు రెండు దశాబ్ధాల కింద కూలీ సినిమా షూటింగ్ సమయంలో గాయపడిన అమితాబ్ కు చెడు రక్తాన్ని ఎక్కించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం బిగ్ బి కాలేయం కేవలం ఇరవై శాతం మాత్రమే పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat