Home / ANDHRAPRADESH / ఖమ్మంలో శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివార్లకు ఘనంగా పుష్పాభిషేకం..!

ఖమ్మంలో శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివార్లకు ఘనంగా పుష్పాభిషేకం..!

విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారికి, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారికి అక్టోబర్ 18, శుక్రవారం నాడు ఖమ్మం నగరం, బైపాస్‌రోడ్డులోని రాజ్‌పథ్ ఫంక్షన్ హాల్‌‌లో వద్దిరాజు రవిచంద్ర, విజయలక్ష్మీల ఆధ్వర్యంలో జరిగిన పుష్పాభిషేకం కార్యక్రమం ఆద్యంతం కన్నులపండుగగా సాగింది. హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు ఖమ్మం నగరంలోని గాయత్రి గ్రానైట్స్ అధినేత శ్రీ వద్దిరాజు రవిచంద్ర నివాసంలో గత నాలుగు రోజులుగా శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు నిర్వహిస్తూ, జిల్లాలోని పలు దేవాలయాలను దర్శిస్తూ ధర్మ ప్రచారం గావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పుష్పాభిషేకం కార్యక్రమానికి వద్దిరాజు దంపతుల ఆహ్వానం మేరకు విశాఖ శ్రీ శారదా పీఠం అధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు ఖమ్మం నగరానికి విచ్చేసారు. నిన్న అక్టోబర్ 17న గురువారం ఉదయం కల్లూరు మండలం, నారాయణపురం గ్రామంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహస్ర చండీయాగంలో పాల్గొన్న శ్రీ స్వరూపానందేంద్ర, శ్రీ స్వాత్మానందేంద్ర, పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం భద్రాద్రి సీతారామస్వామి ఆలయాన్ని దర్శించుకుని నేరుగా ఖమ్మం నగరంలోని వద్దిరాజు రవిచంద్ర నివాసానికి చేరుకున్నారు. ఇవాళ ఉదయం వద్దిరాజు నివాసం నుంచి మేళతాళాలు, భక్త జనుల కోలాటాల నడుమ ఊరేగింపుగా బైపాస్‌రోడ్‌లోని రాజ్‌పథ్ ఫంక్షన్‌హాల్‌కు చేరుకున్న స్వామిజీలకు అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య వద్దిరాజు దంపతులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామీజీలకు వద్దిరాజు దంపతులు గజమాలలతో సత్కరించి, పండ్లు, ఫలహారాలు సమర్పించి పూజలు చేశారు. అనంతరం వందలాది కిలోల గులాబీ పూలతో ఇరువురు స్వామిజీలకు వద్దిరాజు దంపతులు మహాపుష్పాభిషేకం చేశారు. ఈ పుష్పాభిషేకం ఆద్యంతం కన్నులపండుగగా అంగరంగవైభవంగా సాగింది. ఖమ్మం నగరం నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి ప్రముఖులు, భక్తులు వందలాదిగా తరలించి పుష్పాభిషేకం కార్యక్రమాన్ని తిలకించి ఆనందభరితులు అయ్యారు. ఈ సందర్భంగా శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు వద్దిరాజు దంపతులకు, అశేష భక్తజనులకు శుభాశీస్సులు అందజేశారు. పుష్పాభిషేకం అనంతరం ఇరువురు స్వామీజీలు భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. ప్రజలు దైవిచింతనకు, ఆధ్యాత్మికతకు పట్టం కట్టినంతకాలం..సనాతన హిందూ ధర్మం విలసిల్లుతూనే ఉంటుందని..శ్రీ స్వరూపానందేంద్ర స్వామివారు అన్నారు. ఈ కార్యక్రమంలో వద్దిరాజు రవిచంద్ర కుటుంబసభ్యులు, నగర ప్రముఖులు, హిందూ ధర్మ ప్రచారయాత్ర తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త, దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat