Home / ANDHRAPRADESH / బాబుగారి పరువు బెజవాడ కరకట్టలో కలిపేసిన బీజేపీ నేత..!

బాబుగారి పరువు బెజవాడ కరకట్టలో కలిపేసిన బీజేపీ నేత..!

యుపీఏ హయాంలో కేంద్ర హోంమంత్రిగా ఉన్న చిదంబరం రాజకీయ ప్రత్యర్థులపై పెద్ద ఎత్తున కక్ష సాధింపులకు పాల్పడ్డాడు. ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను ఓ హత్యకేసులో ఇరికించి, జైల్లో పెట్టించాడు. చీకట్లో చంద్రబాబును కలిసిన తర్వాత జగన్ జైలుకు వెళ్లడంలో చిదంబరం కీలక పాత్ర పోషించాడు. అయితే మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చిదంబరం ఐఎన్‌ఎక్స్ మీడియా స్కామ్‌‌లో ఇరుక్కుని ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు. ఇక చిదంబరం లాగే ఏపీలో గత ఐదేళ్లలో చంద్రబాబు ఇష్టానుసారంగా చెలరేగిపోయాడు. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు. బీజేపీతో నాలుగేళ్ల అంటకాగి..ఎన్నికలకు ముందు బయటకు వచ్చి మోదీపై ఇష్టం వచ్చినట్లు నోరుపారేసుకున్నాడు. అయితే బాబుకు సీన్ రివర్స్ అయింది. కేంద్రంలో మళ్లీ మోదీ అధికారంలోకి వచ్చాడు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. సీఎం జగన్ గత ఐదేళ్లలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తుండడంతో బాబులో భయాందోళన మొదలైంది. అందుకే మళ్లీ మోదీపాట పాడుతున్నాడు. మోదీతో వ్యక్తిగత విబేధాలు ఏం లేవు..అంటూ మళ్లీ బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే తన నలుగురు ఎంపీలను బీజేపీలో చేర్పించి రాయబారం నడిపిస్తున్నాడు. అయితే బీజేపీ నేతలు మాత్రం బాబుతో మళ్లీ కలిసేదే లేదని కుండబద్ధలు కొడుతున్నారు. తాజాగా . శనివారం విజయవాడలో ‘మీట్‌ ద ప్రెస్‌’ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు జీవీఎల్‌ బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్న చంద్రబాబుపై మండిపడ్డారు. కేంద్ర మాజీ హోంమంత్రి చిదంబరం జైలుకు వెళ్లడం చూసి, తనకు కూడా అదే గతి పడుతుందని చంద్రబాబుకు భయం పట్టుకుందని జీవీఎల్‌ ఎద్దేవా చేశారు. అవినీతిపరులను వదిలి పెట్టేది లేదని ఇటీవల ప్రధాని మోదీ హెచ్చరించగానే ఆ భయంతోనే చంద్రబాబు బీజేపీతో పొత్తు గురించి మాట్లాడుతున్నాడని..ఆయన అన్నారు. అయితే టీడీపీతో తమకు మళ్లీ పొత్తు పెట్టుకునే ఆలోచనే లేదని..కానీ ఆ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామంటే మాత్రం జాతీయ నాయకత్వంతో మాట్లాడడానికి తాను సిద్ధమని జీవియల్ ప్రకటించారు. గతంలో పొత్తు పెటుకున్నప్పుడు టీడీపీ లాభపడింది, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారే కానీ బీజేపీకి నామమాత్రం ప్రయోజనం కూడా కలగలేదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలోకి రావాలనే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని చెప్పారు. అయినా పొత్తు పెట్టుకోవడానికి ఇప్పుడు టీడీపీ దగ్గర ఏముందని జీవియల్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు వరకు మోదీ, బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు పొత్తు గురించి మాట్లాడడం టీడీపీకి రాజకీయ భవిష్యత్‌ లేదని భయపడడం వల్లేనని చెప్పారు. మొత్తంగా  సుజనాచౌదరి వంటి నేతలతో ఎంతగా రాయబారం నడిపించినా బీజేపీ నేతలు ఏ ఏండకాగొడుకు పట్టే చంద్రబాబును మళ్లీ దగ్గరకు రానిచ్చేది లేదని చెబుతున్నారు. అయితే టీడీపీని బీజేపీలో విలీనం చేస్తే మాత్రం ఓకే అంటున్నారు. మొత్తానికి మోదీతో మళ్లీ పొత్తు కోసం నానా తిప్పలు పడుతున్న చంద్రబాబుకు బీజేపీ నేతలు దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తున్నారు. జీవీయల్ వ్యాఖ్యలతో బాబుగారి పరువు బెజవాడ కరకట్టలో కలిసిపోయిందని నెట్‌జన్లు ఓ రేంజ్‌లో సెటైర్లు వేస్తున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat