టాలీవుడ్ సూపర్ హీరో,స్టైల్ స్టార్ అల్లు అర్జున్ పేరుతో రూ. ముప్పై లక్షలు స్వాహా చేసిన సంఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బన్నీ కు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్న సంగతి విదితమే. ఇలా అభిమానినని చెబుతూ మిగతా బన్నీ అభిమానులను బురడీ కొట్టించాడు ఓ ప్రబుద్ధుడు. బన్ని విజయ్ అనే అల్లు అర్జున్ అభిమాని తనకు ప్రమాదం జరిగింది.
తోచినంతా సాయం చేయమని సోషల్ మీడియా వేదికగా అభర్థించాడు. దీంతో తమ అభిమాన హీరో అభిమాని కష్టాల్లో ఉన్నాడు. పైగా ప్రమాదం జరిగింది అని కొన్ని వేల మంది కలిసి దాదాపు రూ. ముప్పై లక్షల వరకు ఆర్థిక సాయం చేశారు.
ఈ విషయం తెల్సుకున్న బన్నీ అసలు వాస్తవం ఏమిటీ.. ఎలా ప్రమాదం జరిగింది.. ఎలా ఉంది ఇలా పలు అంశాల గురించి తన సిబ్బంది చేత ఆరా తీస్తే అసలు బన్నీ విజయ్ లేడు. అది అంతా ఫేక్. ప్రమాదం ఏమి జరగలేదు.. బన్నీ విజయ్ పేరుతో పెద్ద ఫ్రాడ్ కు పాల్పడ్డారని తేలింది. దీంతో షాకవ్వడం అల్లు అర్జున్ వంతైంది.