Home / ANDHRAPRADESH / కర్నూలు జిల్లాలో ఆ కుటుంబాన్ని వెలివేసిన గ్రామ పెద్దలు

కర్నూలు జిల్లాలో ఆ కుటుంబాన్ని వెలివేసిన గ్రామ పెద్దలు

రోజు రోజుకి కాలం ఎంత మారుతున్న… సామాజిక రుగ్మతలు మాత్రం ఇప్పటికీ తగ్గడం లేదు. ఈ సామాజిక అసమానతలు తగ్గించడం కోసం ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు అమలు చేసిన… ఇప్పటికీ కొన్ని కులాలు అంటరాని కులాలుగా మిగిలిపోతున్నాయి. ఈ విషయంపై పట్టణాల్లో కొంత మార్పు వచ్చినప్పటికీ… గ్రామాల్లో మాత్రం ఇప్పటికీ కొందరు అగ్రవర్ణ కులస్తులు తమ అధికారాన్ని చలా ఇస్తూనే ఉన్నారు.తాజాగా కర్నూలు జిల్లాలో గొనెగండ్ల మండలంలోని వేముగోడు గ్రామం లో ఓ రజక కుటుంబాన్ని గ్రామం నుంచివెలి వేస్తూ, సామాజిక బహిష్కరణ విధించారు ఓ పెద్ద రాయుడు. ఇంతకీ వీరు చేసిన తప్పేమిటని ఆలోచిస్తున్నారా…? ఏమీ లేదు… గ్రామంలోని మురికి బట్టలన్నీ రజక కుటుంబాలు ఖచ్చితంగా ఉతకాలట. తమ ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నారనీ, తమకు వయసు పైబడిందని, ఎంత చెప్పినా…. ఆ గ్రామ పెద్ద కనికరించలేదు. ఊర్లో బట్టలన్నీ కచ్చితంగా చాకలోళ్లు ఉతకాల్సిందే అని… లేకపోతే గ్రామం నుంచి వెళ్లిపోవాలని వెలివేసాడంట ఆ గ్రామపెద్ద. ఇంతటితో ఊరుకోకుండా గ్రామంలోని మంచినీటి తాగకూడదని, గ్రామంలో ఉన్న కిరాణాకొట్టు నుంచి నిత్యవసర సరుకులు తీసుకోకూడదని, గ్రామంలోని చాకలోళ్లకి ఎవరు వస్తువులు అమ్మకూడదని, గ్రామంలో అధికారిక ఉత్తర్వులు ఇచ్చే దండోరా వేయించాడు ఆ గ్రామ పెద్ద. ఇదేంటని అడిగితే మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోమని కులం పేరుతో దూషిస్తూ హుక్కం జారీ చేశాడా గ్రామ పెద్ద రాయుడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat