తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సింగరేణి కార్మికులకు ఇటీవల అసెంబ్లీ సమావేశాల సాక్షిగా దీపావళి బోనస్ ను ప్రకటించిన సంగతి మనకు తెల్సిందే. ఇందులో భాగంగా ఒక్కో సింగరేణి కార్మికుడికి రూ.64,700 లను దీపావళి బోనస్ గా అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
పర్మార్మెన్స్ లింక్డ్ రివార్డు స్కీం కింద సింగరేణి సంస్థ ఈ బోనస్ ను అందజేసింది. ఇందుకు మొత్తం రూ.258కోట్లను సంస్థ చెల్లించింది. తెలంగాణ రాకముందు సింగరేణి కార్మికులు అందుకున్న బోనస్ మొత్తాన్ని తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించిన బోనస్ మొత్తాన్ని పోలిస్తే తెలంగాణలోనే అధిక మొత్తంలో బోనస్ ను అందుకున్నట్లు కార్మికులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తోన్నారు.