Home / ANDHRAPRADESH / అక్టోబర్ 31 న విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి పుట్టినరోజు వేడుకలు…శ్రీ స్వాత్మానందేంద్ర..!

అక్టోబర్ 31 న విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి పుట్టినరోజు వేడుకలు…శ్రీ స్వాత్మానందేంద్ర..!

అక్టోబర్ 31న నాగులచవితి, గురువారం నాడు భారతీయ సనాతన సంస్కృతీ, సంప్రదాయాలే ఊపిరిగా..స్వధర్మ పరిరక్షణకు అహర్నిశలు పాటుపడుతున్న..విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు, గురువర్యులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలు..అత్యంత ఘనంగా నిర్వహించేందుకు విశాఖ శ్రీ శారదాపీఠం సిద్ధమవుతోంది. ఈ రోజు చినముషిడివాడలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు తమ గురువర్యులు, పీఠాధిపతులైన శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినోత్సవ వేడుకల వివరాలను మీడియాకు తెలియజేశారు. అక్టోబర్ 31 న విశాఖ శ్రీ శారదాపీఠం, శారదాపీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాస్వామివారి జన్మదిన వేడుకలు ఉదయం నుంచి 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు ఘనంగా జరుగుతాయని శ్రీ స్వాత్మానందేంద్ర తెలిపారు. శ్రీ మహాగణపతిపూజ, పుణ్యాహవచనం, షణ్ముఖ శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి అభిషేకం, రుద్రక్రమార్చన , ఆవాహంతీ హోమం, ఆయుష్య హోమం, పాదపూజ & భిక్షావందనం, మహాపూర్ణాహుతి, సామూహిక లలిత, విష్ణుసహస్రనామ పారాయణం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాయంత్రం పేదమహిళలకు చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని శ్రీ స్వాత్మానందేంద్ర పేర్కొన్నారు.

శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలు కేవలం విశాఖ శ్రీ శారదాపీఠానికి, విశాఖకే పరిమితం కాకుండా..ఆసేతు హిమాచలం వరకు ఘనంగా నిర్వహించేందుకు భక్తులు సమాయాత్తం అవుతున్నారని శ్రీ స్వాత్మానందేంద్ర తెలియజేశారు. జన్మదిన వేడుకల్లో భాగంగా..విశాఖపట్టణం కేజీహెచ్‌లో అనేకమంది రోగులకు, వీల్‌ఛెయిర్లు, పండ్లు, ఫలహారాల పంపిణీకి విశాఖ శ్రీ శారదాపీఠం ఏర్పాట్లు చేస్తోంది. అంతే కాకుండా అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు దేవాలయాల్లో ఉండే సిబ్బందికి, వస్త్రాలు, దుప్పట్ల పంపిణీ వంటి ఇత్యాది అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు శారదాపీఠం భక్తులు సిద్ధమవుతున్నారు. హిమాలయాల్లో కూడా..విశాఖ శ్రీ శారదాపీఠం తరపున అనేకమంది సాధుసంతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలు జరుపనున్నారు.

విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర మహాస్వామివారి జన్మదినోత్సవ మహోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశం నలుమూలల నుంచి రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. ఇప్పటికే తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్‌కు స్వామివారి జన్మదినోత్స వేడుకలకు హాజరు కావల్సిందిగా హిందూ ధర్మ ప్రచారయాత్ర సమన్వయకర్త, దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి ఆహ్వానం పలికారు. అలాగే ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు కూడా శారదాపీఠం ఆహ్వానం అందించింది. మహా స్వామివారి జన్మదినోత్సవ వేడుకలకు తెలుగు రాష్ట్రాల గవర్నర్లతో సహా పలువురు రాజకీయ, వ్యాపార దిగ్గజాలు , సామాన్య భక్తులు కూడా వేలాదిగా తరలివచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లను విశాఖ శ్రీ శారదాపీఠం పూర్తి చేసింది. ఎల్లుండి విశాఖ శారదాపీఠం నుంచి ఆసేతు హిమాచలం వరకు మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలు అంగరంగవైభవంగా జరుగున్నాయి ఇప్పటికే విశాఖ నగరమంతటా హోర్డింగ్‌లు, ప్లెక్సీలతో భక్తులు మహాస్వామివారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మొత్తంగా విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలతో విశాఖ నగరంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat