Home / ANDHRAPRADESH / ఏపీలో జగన్ చేపట్టిన మద్యపాన నిషేధం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలుసా…?

ఏపీలో జగన్ చేపట్టిన మద్యపాన నిషేధం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలుసా…?

గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే దశలవారీగా మద్యపానాన్ని నిషేధించాలని హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ఎందుకు అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే జగన్ మద్యపాన నిషేధానికి చర్యలు తీసుకున్నారు. మద్యం రేట్లను పెంచడంతో పాటు బెల్టు షాపులను ఎత్తి వేశారు గ్రామాలలో పట్టణాలలో ఎక్కడపడితే అక్కడ కనిపించే మద్యం షాపులకు బదులుగా ప్రభుత్వమే మద్యం షాపులను ప్రస్తుతం నిర్వహిస్తోంది. దీని మూలంగా సగటున 50 శాతం మద్యం షాపులు తగ్గిపోయాయి. ఉదయం నుంచి రాత్రి వరకు అమ్ముతున్న వేళల్లో కూడా మార్పులు తెచ్చారు. అయితే ఈ మధ్యపాన నిషేధం పై చాలామంది రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్నారు. రాజకీయ పరంగా ఎన్నో విమర్శలకు మద్యపాన నిషేధం కార్యక్రమం తావిచ్చింది.

 

 

అయితే మద్యపాన నిషేధం వల్ల భారీగా సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెద్ద ఎత్తున తగ్గిపోయాయి. ఎందుకంటే ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా పర్మిట్ రూమ్ లు ఇవ్వడం పట్ల యువత తాగి డ్రైవ్ చేసే వారు. దాని వల్ల ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయితే జగన్ ఇప్పుడు మద్యం మహమ్మారి కాపురాల్లో చిచ్చు పెడుతుందని అవి లేకుండా చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. అయితే మద్యం నిషేధించిన ఇన్ని రోజుల తర్వాత పలువురు పోలీసులు చెబుతున్న లెక్కల ప్రకారం గ్రామాలలో, పట్టణాలలో భార్య భర్తల మధ్య గొడవలు గణనీయంగా తగ్గిపోయాయని చెబుతున్నారు. అయితే రాష్ట్ర ప్రజల మేలు కోసం ముఖ్యమంత్రి తీసుకున్న అత్యంత సంచలనాత్మకమైన నిర్ణయం భవిష్యత్ తరాలకు మంచి చేసేదిగా ఉండటం శుభపరిణామం.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat