Home / 18+ / ఆ సినిమాలో పాల్ పాట వింటే కడుపు చెక్కలు అయిపోతుంది..!

ఆ సినిమాలో పాల్ పాట వింటే కడుపు చెక్కలు అయిపోతుంది..!

వివాదాల డైరెక్టర్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో ‘నేనే కేఏ పాల్.. సూపిస్తా కమాల్.. నేనంటే మిలిటరీకే హడల్. దేవుడికైనా గుండె గుభేల్’ అంటూ చాలా ఫన్నీ లిరిక్స్‌‌తో ఓ పాటను కంపోజ్ చేశారు. గత లోక్ సభ ఎన్నికల సమయంలో కేఏ పాల్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఎన్నికలంటే అందరు రాజకీయ నాయకులు ఎంతో సీరియస్‌గా ఓట్ల కోసం కృషి చేస్తారు. ఓట్లు వేయించుకునేలా పని చేస్తారు. కానీ పాల్ మాత్రం కామెడీ యాంగిల్‌తో జనాలతో పాటు ఇతర రాజకీయవేత్తలను నవ్వించారు. ఆసమయంలో పాల్ చేసిన ఫన్నీ వీడియోలు, కామెంట్లు, సెలబ్రిటీలతో ఆయన దిగిన ఫొటోలు మొత్తం వీడియోలో చూపించారు. ‘మనదంతా ఇంటర్నేషనల్ థింకింగ్.. చిన్న చిన్నవాళ్లైన జగన్, చంద్రబాబు, కేసీఆర్ పవన్ కళ్యాణ్ కాదు మోదీ మన టార్గెట్.. 2024లో ఆ సీట్ మందే.. మన ప్రమాణ స్వీకారానికి ఒకరు ఇద్దరు కాదు 150 దేశాలకు చెందిన ప్రధాన మంత్రులు తమ ఫ్యామిలీతో కలిసి వస్తారు అంటూ పాల్ చెప్పిన మాటలను వీడియోలో చూపించారు. ఈ వీడియో చూసినవారికి మాత్రం పొట్ట చెక్కలు అవుతుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat