Home / ANDHRAPRADESH / జగన్ గురించి కొత్తగా చెప్పేదేముంది.?

జగన్ గురించి కొత్తగా చెప్పేదేముంది.?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు “జగన్” గురించి కొత్తగా తెలియవలసింది ఏముంది, మనం చెప్పవలసింది ఏముంది.

*”జగన్” తప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీలో వున్నన్నాళ్ళూ ఎందుకు కేసులు పెట్టకుండా, పార్టీని ఎదిరించి పార్టీ  నుండి బయటకు వచ్చిన మరుక్షణం కేసులు పెట్టారు.

*”జగన్” తప్పు చేస్తే అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు ఎందుకు వస్తారు.

*”జగన్” తప్పు చేస్తే చంద్రబాబు లా ఎవరి కాళ్ళపై పడడానికి అయినా ఎవరిని చీకటిలో కలవడానికి  అయినా ఎందుకు వెళ్లకుండా ధైర్యంగా కేసులను ఎదుర్కొంటారు.

*”జగన్” తప్పు చేస్తే నా పై వున్న  కేసులను త్వరితగతిన విచారణ చేపట్టండి అని కోర్టుకు ఎందుకు విన్నవించుకుంటారు.

*”జగన్” తప్పు చేస్తే గత ఐదేళ్లు గా కేంద్రంలో అధికారంలో వున్న బిజెపిని నిలదీస్తూ ప్రత్యేకహోదా కావాలని ధర్నాలు ధీక్షలు ఎందుకు చేస్తారు.

*”జగన” తప్పు చేస్తే నేను తప్పు చేసాను నాకెందుకు అనుకోకుండా ప్రజలకు ఎక్కడ ఏ సమస్య వున్నా ఆ సమస్య కోసం ఎందుకు పోరాడారు.

*”జగన్” తప్పు చేస్తే నేను పాదయాత్ర చేస్తే ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్నా అని తెలియని వారికి కూడా తెలుస్తుందని సైలెంట్ గా వుండక ప్రజలు సమస్యలు తెలుసు కోవడం కోసం ఎందుకు పాదయాత్ర చేసారు.

అసలు “జగన్” నిజాయితీ,మాట మీద నిలబడే తత్వం, గుండె ధైర్యం చూసి కదా మేము ఆయనకు అభిమానులం అయ్యుంది.ఇప్పుడు మీరు ఆయనను తక్కువ చేసేదేముంది.అన్ని ముళ్ల బాటలను దాటుకొని వచ్చిన ఆయనను మీరు చేయగలిగింది ఏముంది. ఎవరి అండాలేదు, ఎవరి తోడు లేదు, పెద్దల సహాయం లేదు. ప్రజలను నమ్ముకున్నారు ఒంటరిగా వచ్చారు ఇంతవరకు ఎవరూ సాధించని విధంగా 151 సీట్లు తో ఒక చరిత్ర సృష్టించారు ఇప్పుడు కొత్తగా మీరు ఆయనను చేసేదేముంది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat