Home / SPORTS / టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్ విడుదల..!

టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్ విడుదల..!

టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్ విడుదలైయ్యింది. ఈసారి ప్రపంచకప్‌లో పపువా న్యూగినియా, ఐర్లండ్, నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్ వంటి చిన్న దేశాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. మొత్తం 16 దేశాలు ఈ మెగాటోర్నీలో తలపడనున్నాయి. క్వాలిఫయర్ మ్యాచ్‌లు ముగియడంతో ఈ టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూలును ఐసీసీ విడుదల చేసింది. వచ్చే ఏడాది అక్టోబరు 18న కార్డినియా పార్క్‌లో శ్రీలంక-ఐర్లండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. నవంబరు 15న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత జట్టు మొత్తం 5 మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబరు 24న పెర్త్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో ఫస్ట్‌ మ్యాచ్‌ ఆడనుంది టీమిండియాగ్రూప్-ఎ: శ్రీలంక, పపువా న్యూగినియా, ఐర్లండ్‌, ఒమన్‌

గ్రూప్-బి : బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌, నమీబియా, స్కాట్లాండ్‌

సూపర్ -12 దశలో జట్లను గ్రూప్ 1, గ్రూపు2గా ఐసీసీ విభజించింది.

గ్రూప్ 1 : పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్

గ్రూప్ 2 : భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్

గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు అలాగే గ్రూప్ బీలో రెండో స్థానంలో నిలిచిన జట్లు సూపర్ -12లోని గ్రూప్ 1లో చేరతాయి. ఈ గ్రూపులో పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్ ఉన్నాయి. ఇక, గ్రూప్ ‘బి’ లో తొలిజట్టు, గ్రూప్ ‘ఎ’ లో రెండో స్థానంలో ఉన్న జట్టు సూపర్ -12 దశలో గ్రూప్-2 లో జట్లతో తలపడతాయి. ఈ గ్రూప్ లో భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ జట్లు ఉన్నాయి.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat