టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గోన్నారు . తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ళ గ్రామంలో 3 కోట్లతో ఐదు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన మార్కెట్ గోదాం ప్రారంభించారు, ఆనంతరం ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్ కు భూమిపూజ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో 33/11 KV సబ్ స్టేషన్,అంబులెన్స్ మరియు శాదీఖానా ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇవాళ ఉదయం నుంచి 5 గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నాను. చాలా సంతోషంగా ఉంది. దేశంలో ఎక్కడా 24 గంటల కరెంటు సరఫరా చేయడం లేదు. అల్మాస్పూర్ చెరువును నీటితో నింపడమే కాదు రాజన్న సిరిసిల్ల జిల్లాను కోనసీమకు దీటుగా తీర్చిదిద్దే బాధ్యత నాది. వృత్తి మీద ఆధారపడే వారికి అనేక రకాల పథకాలు అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో రైతాంగానికి 24 గంటల కరెంటు ఇస్తున్నాం. దేశంలోనే ధనిక రైతులు తెలంగాణలో ఉండేలా సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని’ మంత్రి వివరించారు.
Minister @KTRTRS inaugurated 33/11 KV Substations at Narayanapur, Akkapally and Racharla Thimmapur villages in Yellareddypet mandal, Sircilla district. @Collector_RSL Krishna Bhaskar participated. pic.twitter.com/NfphHcX9u1
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 8, 2019
Minister @KTRTRS laid foundation stone for the construction of 'Primary Processing Centre' at Jillella village in Sircilla. The govt will construct the Centre at a cost of Rs.5.71 crores. @Collector_RSL Krishna Bhaskar, @TSIICLtd Chairman Balamallu, & @tsiic_vcmd participated. pic.twitter.com/y3J7EJDThD
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 8, 2019