మీరు సరిగా నిద్రపోరా..?. పడుకోవాల్సిన సమయం కంటే తక్కువ సమయం నిద్రపోతారా.?. అసలు నిద్రను నిర్లక్ష్యం చేస్తారా..?. అయితే ఇది మీలాంటి వాళ్ల కోసమే. అసలు విషయం ఏమిటంటే నిద్ర సరిగా పోకపోవడం వలన చాలా సమస్యలున్నాయని పలు పరిశోధనలు ఇప్పటికే స్పష్టం చేశాయి.
తాజా సర్వేలో నిద్రలేమితో శరీరంలోని ఎముకలు బలహీనమవుతాయి. అవసరమైన దానికంటే తక్కువగా నిద్రపోయే వారిలో ఖనిజ సాంద్రత తగ్గి బోలు ఎముకలు బలహీనపడతాయని అమెరికాకు చెందిన స్టేట్ యూనివర్సీటీ ఆఫ్ న్యూయార్క్ శాస్త్రవేత్తలు తెలిపారు.
అందుకే రాత్రిళ్లు ఏడు గంటలు నిద్రిస్తున్నవారితో పోలిస్తే ఐదు గంటల కంటే తక్కువగా నిద్రిస్తున్నవారిలో ఈ తేడాను గుర్తించారు.