Home / ANDHRAPRADESH / నేను పవన్ కల్యాణ్‌కు వీరాభిమానిని..కాని.. మంత్రి అనిల్‌కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

నేను పవన్ కల్యాణ్‌కు వీరాభిమానిని..కాని.. మంత్రి అనిల్‌కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

వైసీపీలో దూకుడుగా వ్యవహరించే నేతల్లో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై సమయం దొరికితే పదునైన మాటలతో విరుచుకుపడే మంత్రి అనిల్ కుమార్ తాజాగా ఓ ఛానల్‌లో చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. తాను పవన్ కల్యాణ్‌కు వీరాభిమానిని అని, చదువుకునే రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌‌కు పెద్ద ఫ్యాన్‌ని, ముఖ్యంగా పవన్‌ను పిచ్చిగా అభిమానించేవాడినని మంత్రి అనిల్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పవన్‌ కల్యాణ్ అంటే ఇప్పటికీ వ్యక్తిగతంగా తనకు ఇష్టమే కానీ..రాజకీయంగా మాత్రం తిట్టాల్సి వస్తుందని అన్నారు. పవన్ నిజమైన రాజకీయవేత్త కాదని…సినిమాల్లో చిరంజీవి వల్ల ఎదిగిన పవన్ రాజకీయాల్లోకి వచ్చాక తాను కానిస్టేబుల్ కొడుకును అని చెప్పుకుని తిరుగుతున్నాడని..ఇక్కడే పవన్ ద్వంద వైఖరి తెలుుస్తోందని మంత్రి అనిల్‌కుమార్ విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు..చంద్రబాబు, లోకేష్‌లు ఎంత అవినీతికి పాల్పడినా..పల్లెత్తు మాట అనని పవన్ కల్యాణ్..ఇప్పుడు సీఎం జగన్‌ను విమర్శించడం ఏంటని అనిల్ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న చంద్రబాబును ప్రశ్నించని..పవన్ నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్‌ను పదే పదే టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా విమర్శించేవాడని..ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్‌ను టార్గెట్ చేస్తూ..విమర్శలు చేయడం తనకు నచ్చలేదని అనిల్‌కుమార్ అన్నారు. ఇప్పటికీ చంద్రబాబు చెప్పినట్లు ఆడుతున్న పవన్ కల్యాణ్‌ను ప్రజలు నమ్మరని..సీఎం జగన్‌పై తనకే కాదు..ప్రజలకు కూడా నమ్మకం ఉందని..మంత్రి అనిల్‌కుమార్ అన్నారు. పవన్ కల్యాణ్‌ను సినిమాపరంగా అభిమానించినా..రాజకీయంగా మాత్రం విబేధిస్తానని, సీఎం జగన్‌పై అనవసరపు విమర్శలు చేస్తే.. ఆయనకు ధీటుగా సమాధానం చెబుతానని మంత్రి అనిల్‌కుమార్ చెప్పారు.. కాగా గతంలో కూడా పలు సందర్భాల్లో పవన్‌ కల్యాణ్‌కు వీరాభిమానిగా చెప్పుకున్న మంత్రి అనిల్‌కుమార్ రాజకీయంగా మాత్రం జనసేనాని తీరును ఎండగట్టేందుకు వెనుకాడనని మరోసారి స్పష్టం చేశాడు.మొత్తంగా పవన్‌ కల్యాణ్‌‌పై మంత్రి అనిల్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat