ప్రముఖ సీనియర్ గాయని లతా మంగేష్కర్ (90)హెల్త్ కండీషన్ ఇంకా విషమంగానే ఉన్నాట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని నెమ్మదిగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు.
ప్రస్తుతం లతా మంగేష్కర్ శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అయితే అంతకు ముందు ఈ సమస్యతోనే ఆమెను ముంబైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో నిన్న సోమవారం తెల్లరుజామున చేర్చారు.