Home / NATIONAL / మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం

ఇటీవల విడుదలైన మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ సాధించలేకపోయిన సంగతి విదితమే. దీంతో ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ కోశ్యారీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ(105)ని ఆహ్వానించారు. అయితే ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి,బీజీఎల్పీ నేత అయిన పడ్నవీస్ మాకు అంత మెజారిటీ లేదని వెనక్కి తగ్గారు.

ఆ తర్వాత అతి పెద్ద పార్టీగా అవతరించిన శివసేన(56)ను గవర్నర్ ఆహ్వానించారు. దీంతో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మిగిలిన పార్టీలైన కాంగ్రెస్( 44),ఎన్సీపీ (54),ఇతరులు (29) ల సహాకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆశించారు.

ఈ క్రమంలో చివరిలో కాంగ్రెస్ హ్యాండిచ్చింది.తాజాగా మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర పతి పాలన విధించడానికి కేంద్ర హోమ్ శాఖ కు గవర్నర్ నివేదిక పంపారని వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఈ లోపు ఏ పార్టీ అయిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొస్తుందేమో..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat