Home / MOVIES / బాలయ్య సినిమాకు హీరోయిన్ కొరత.కారణం అదేనా..?

బాలయ్య సినిమాకు హీరోయిన్ కొరత.కారణం అదేనా..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న మూవీ రూలర్. ఈ మూవీ వచ్చే నెల డిసెంబర్ లో విడుదల కానున్నది. ఈ మూవీ తర్వాత యాక్షన్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నాడు అని సమాచారం. గతంలో బోయపాటి శ్రీను తెరకెక్కించిన లెజెండ్ మూవీ తరహాలోనే బాలయ్య తాజా చిత్రముంటుందని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తోన్నాయి.

అయితే బాలయ్య సరసన నటించడానికి హీరోయిన్ కొరత ఉన్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలయ్య లాంటి సీనియర్ హీరో సరసన నటించడానికి ఏ హీరోయిన్ ముందుకురాకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక్కడ ఒక ప్రధాన కారణం కూడా చెబుతున్నారు. బాలయ్య సరసన నటించిన ఏ హీరోయిన్ కూడా తర్వాత ఇండస్ట్రీలో కొనసాగకపోవడమే అని అంటున్నారు. అయితే ఒకరిద్దరూ తప్పా ఈ మధ్య కాలంలో బాలయ్య సరసన నటించిన ఏ హీరోయిన్ కూడా ఇండస్ట్రీలో ఎక్కువకాలం ఉండకపోవడం గమనార్హం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat