Home / POLITICS / కనీస మద్దతు ధర ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ..!!

కనీస మద్దతు ధర ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ..!!

రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ప్రతి ధాన్యం గింజను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న రాష్ట్రం భారతదేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ రోజు మీడియాతో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఆర్థిక భారం అయినా కూడా రైతును రాజుగా చూడాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు దూరదృష్టితో చేపట్టిన రైతు సంక్షేమ చర్యలు, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, 24 గంటల కరెంటు, రైతు బంధు వంటి పథకాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగి ఈ ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి కానుంది. ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అలాగే రాష్ట్రానికి ఆర్థిక భారం అయినా కూడా రాష్ట్రంలో రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనాలని ముఖ్యమంత్రి గారు ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభానికి ముందే స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఆ మేరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు, కనీస మద్దతు ధర చెల్లింపుల్లో ఎలాంటి జాప్యానికి తావులేకుండా చూడాలని జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులకు విజ్ఞప్తి చేశారు. పక్క రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు ధాన్యం కొనుగోళ్లలో సీలింగ్‌ విధించడం, గిట్టుబాటు ధర లభించకపోవడంతో కొంతమంది దళారులు, వ్యాపారస్తులు రైతుల పేరుతో తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని, సరిహద్దులో గట్టి నిఘాతో దీన్ని అరికట్టాలని సూచించారు.

ఇతర రాష్ట్రల నుంచి అక్రమంగా ధాన్యం రాకుండా చూడాలని, ఈ విషయంలో కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, పోలీసు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర రైతుకు నష్టం కలిగించే ఏ చర్యను కూడా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.ఈ ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి అవుతున్న నేపథ్యంలో రైతులకు అందుబాటులో ఉండేలా 3406 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 1447 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 36,862 మంది రైతుల నుండి 2.51 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ఇందులో 2.39 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించడం జరిగింది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని లోడింగ్‌ చేసి ఆ వివరాలను కేంద్రాల నిర్వాహకులు ట్యాబ్‌ ద్వారా ఓపీఎంఎస్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదు (ట్రక్‌ షీట్‌) చేస్తున్నారు. దీని ప్రకారం రైస్‌ మిల్లర్లు ఎలాంటి జాప్యం చేయకుండా నిర్వాహకులు నమోదు చేసిన వివరాలకు ఆన్‌లైన్‌లోనే ఆమోదం తెలపాలి. తద్వారా రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపుల్లో త్వరితగతిన రైతు బ్యాంక్‌ ఖాతాలో జమ చేయడానికి వీలవుతుంది. ధాన్యం కొనుగోల్లు, చెల్లింపులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఓపీఎంఎస్‌)లో నమోదు చేయడం జరుగుతుంది. రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ధాన్యం విక్రయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీలతో కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు సమావేశాలు నిర్వహిస్తూ, ముఖ్యంగా ధాన్యం లోడింగ్‌, అన్‌లోడింగ్‌, ఆన్‌లైన్‌లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మిల్లర్ల అక్నాలెడ్జ్‌మెంట్‌ వంటి అంశాలపై నిత్యం సమీక్షించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రాష్ట్రస్థాయిలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ధాన్యం కొనుగోళ్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు. క్షేత్రస్థాయిలో ఏదైనా సమస్యలు ఉంటే కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఇతర అధికారులు వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ధాన్యం సేకరణలో సమస్యలు, ఇతర ఫిర్యాదులకు కోసం పౌరసరఫరాల శాఖ కేంద్ర కార్యాలయంలో టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 425 00333, వాట్సప్‌ నంబర్‌ 7330774444లను అందుబాటులో ఉంచడం జరిగింది. రైతులు ధాన్యం విక్రయించే సమయంలో తేమ శాతాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా తేమ శాతం 17% లోపు ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విషయంలో అధికారులు రైతులకు మరింత అవగాహన కల్పించాలి. రైతులు పంట పొలాల నుంచి ఒకేసారి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురాకుండా అక్కడి పరిస్థితులకు అనుగుణంగా దశలవారీగా తీసుకువచ్చేలా కేంద్రాల నిర్వాహకులు రైతుల్లో అవగాహన తీసుకురావాలి. ఈ విషయంలో రైతులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని శ్రీనివాస్‌రెడ్డి కోరారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat