Home / ANDHRAPRADESH / ఏపీ రాజకీయాలలో అతిపెద్ద కుదుపు… టీడీపీకి 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా..?

ఏపీ రాజకీయాలలో అతిపెద్ద కుదుపు… టీడీపీకి 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా..?

ఏపీ రాజకీయాల్లో అతి పెద్ద కుదుపు రాబోతుందని..టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఏమంటూ అన్నాడో కానీ..టీడీపీలో మాత్రం అతి పెద్ద కుదుపు రాబోతుంది. ఇప్పటికే గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసి త్వరలో వైసీపీలో చేరబోతున్నాడు. కాగా మరో 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం. విజయవాడలో జరిగిన చంద్రబాబు ఇసుక దీక్షకు 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంతో వీరు త్వరలో పార్టీకి గుడ్‌బై చెప్పడం ఖాయమని టీడీపీలో చర్చ జరుగుతోంది. ప్రకాశం జిల్లాలో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఒక్కరే హాజరయ్యారు. అది కూడా అలా వచ్చి కనపడి వెళ్లిపోయారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కొండేపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామిలు డుమ్మా కొట్టారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి వైసీపీలో చేరుతాడంటూ ప్రచారం జరుగుతోంది. కాని బీజేపీ నేతలు కూడా తమ పార్టీలోకి రవిని తీసుకోవడానికి ప్రయత్నాలు షురూ చేశారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా బీజేపీ గాలమేస్తోంది. ఇక వైజాగ్ నుంచి గెలిచిన 4 గురు ఎమ్మెల్యేలలో బాబుగారి ఇసుక దీక్షకు వెలగపూడి రామకృష్ణ మాత్రమే వచ్చాడు. గంటా, వాసుపల్లి గణేష్‌లు బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు, బెందాళం అశోక్ తదితరులు దీక్షకు హాజరు కాలేదు. హిందూ పురం ఎమ్మెల్యే, స్వయానా బాబుగారి వియ్యంకుడైన బాలయ్య సినిమా షూటింగ్‌లలో బిజీగా ఉండే దీక్షకు రాలేదు. విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అమెరికా టూర్‌లో ఉండడం వల్ల రాలేదు. పయ్యావుల కేశవ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. కాగా ఇప్పటికే 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ, వైసీపీ నేతలు అంటున్నారు. సోము వీర్రాజు లాంటి నేతలు ఒకడుగు ముందుకేసి మొత్తం 23 మందిని బీజేపీలోకి కలుపుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కనీసం 10 నుంచి 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ఆపరేషన్ మొదలుపెట్టింది. కాగా వంశీతో పాటు మరో ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మొత్తంగా టీడీపీకి 14 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.. అదే జరిగితే వర్ల రామయ్య అన్నట్లు ఏపీ రాజకీయాల్లో కాకుండా టీడీపీలో అతి పెద్ద కుదుపు రావడం ఖాయంగా కనిపిస్తుంది.

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat