Home / ANDHRAPRADESH / బ్రేకింగ్..మళ్లీ పప్పులో కాలేసిన నారావారి పుత్రరత్నం..!

బ్రేకింగ్..మళ్లీ పప్పులో కాలేసిన నారావారి పుత్రరత్నం..!

మందలగిరి మాలోకం సారీ సారీ..సోషల్ మీడియా ఎఫెక్ట్..వీర తెలుగుదేశం అభిమానులు క్షమించగలరు..మన నారావారి పుత్రరత్నం లోకేష్ ఈ మధ్య జనాల్లోకి రావడం కంటే..ఎక్కువగా ట్విట్టర్‌లోనే కూతెడుతున్నారండోయ్…జనాల్లోకి వస్తే నాలిక మందమై మంగళగిరిని.. మందలగిరి అని, జయంతిని వర్థంతి అని నోరుజారుతాడేమోనని బాబుగారు బయటకు రానివ్వడం లేదు..అయితే మొన్నీ మధ్య బయటకు వచ్చినా సుష్టుగా టిఫినీలు, కాఫీలు లాగించేసి.. ఓ నాలుగు గంటల నిరాహారదీక్ష చేసి, నిమ్మరసం తాగి వెళ్లిపోయాడే కానీ పెద్దగా మాట్లాడలేదులెండి..ఇంతకీ విషయానికి వద్దాం..మన లోకేష్ బాబుకు ప్రతి రోజూ సీఎం జగన్‌పై ఒక్క ట్వీట్ అన్నా వేసి తిట్టడం అలవాటు కదా..అదే మాదిరిగా ఈ రోజు కూడా మద్యనిషేధంపై ట్వీట్ చేస్తూ జగన్‌ను తెగ తిట్టేశానని మురిసిపోయాడు. అయితే లోకేష్‌ బాబు పెట్టించుకున్న తెలుగు ట్యూషన్ లేట్‌గా పని చేస్తుందో లేదో తెలియదు కాని..ఈ మధ్య తెగ ప్రాసల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇవాళ కూడా ప్రాస కోసం పాకులాడి నెట్‌జన్లకు అడ్డంగా దొరికిపోయాడు. ఇంతకీ లోకేష్ ఏం ట్వీట్ చేశాడో చూడండి.. మద్యపాన నిషేధం కోసం వైయస్ జగన్ గారు ‘మంద’డుగు వేస్తూనే ఉన్నారు. దాని ఫలితమే కాబోలు.. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. గ్రామాల్లో బెల్టు షాపులు పుట్ట గొడుగుల్లా వెలుస్తున్నాయి. జగనన్న మద్యం దుకాణాల్లో రేటు పెంచి వైకాపా మార్క్ దోపిడీని యధావిధిగా కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా షాపులు తగ్గించాం, బార్లు తగ్గించడానికి శ్రమిస్తున్నాం అంటూ ఉపన్యాసాలు ఇస్తున్న మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా.. గతంలో కంటే ఒక్క క్వార్టర్ బాటిల్ అమ్మకం తగ్గిందా చెప్పండి జగన్ గారు అంటూ ట్విట్టర్‌లో చినబాబు చెలరేగిపోయాడు. అయితే ఇక్కడే లోకేష్ మద్యం మందగుడు అంటూ ప్రాసకోసం పాకులాడి నెట్‌జన్లకు బుక్కైపోయాడు. గతంలో మంగళగిరిని, మందలగిరి చేశావు..ఇప్పుడు ముందడుగును మందడుగు చేశావు.. మందలగిరి..మందడుగు వాటే టైమింగ్ అంటూ నెట్‌జన్లు లోకేష్‌ను చెడుగుడు ఆడారు.

ఇక సబ్జెక్టు తెలియకుండా ఏదో ఒకటి తిట్టాలి కదా అని ట్వీట్ చేసి పప్పులో కాలేయడం లోకేష్‌కు అలవాటుగా మారింది. గతంలొ కంటే ఇప్పుడు ఒక్క కార్వర్ బాటిల్ అమ్మకం తగ్గిందా జగన్ గారు అంటూ లోకేష్ అమాయకంగా అడిగేసి నవ్వులపాలయ్యాడు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ తాజా లెక్కల ప్రకారం… 2018 అక్టోబర్ లో 32లక్షల 28వేల 366 కేసులు లిక్కర్‌ను విక్రయించగా 2019 అక్టోబర్ లో మాత్రం 23లక్షల 60వేల 089 కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. . గతేడాది అక్టోబర్ తో పోల్చుకుంటే అంటే అప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పటి కంటే ఈ ఏడాది అక్టోబర్‌లో అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విక్రయాలు 27 శాతం తగ్గాయి. ఇక బీర్ల అమ్మకాలు చూసుకుంటే గత ఏడాది టీడీపీ హయాంలో ఇదే అక్టోబర్ లో 23లక్షల 86వేల 397 కేసులు అమ్ముడు కాగా.. ఈ ఏడాది అక్టోబర్ లో 10లక్షల 40వేల 539 కేసులు మాత్రమే విక్రయించినట్లు ఏపీ బేవరేజెస్ లిమిటెడ్ తెలిపింది.అంటే గతేడాది అక్టోబర్ తో పోలిస్తే 56.4 శాతం తక్కువగా బీర్లు అమ్మకాలు జరిగాయి. ఈ మద్యం విక్రయాలు, అమ్మకాల వివరాలన్నీ నెల రోజుల కిందట అన్ని ఎల్లోమీడియా ఛానళ్లు, పత్రికల్లో వచ్చాయి. దీన్ని బట్టి సరైన అవగాహన లేకుండా రోజూ సీఎం జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్న లోకేష్..గతంలో కంటే ఒక్క క్వార్టర్ బాటిల్ అమ్మకం తగ్గిందా అంటూ చెప్పండి జగన్ గారు అంటూ  తెలివితక్కువ ట్వీట్ చేశాడు. అలాగే మద్యం, మందడుగు అంటూ ప్రాస కోసం ప్రయత్నించి..నవ్వుల పాలయ్యాడు. ప్రస్తుతం మందలగిరి, మందడుగు..వాటే టైమింగ్ లోకేష్ అంటూ నెట్‌జన్లు సైటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat