Home / ANDHRAPRADESH / చంద్రబాబుకు షాక్ ఇచ్చిన ఏసీబీ కోర్టు..అక్రమాస్తుల కేసులో విచారణకు ఆదేశాలు..!

చంద్రబాబుకు షాక్ ఇచ్చిన ఏసీబీ కోర్టు..అక్రమాస్తుల కేసులో విచారణకు ఆదేశాలు..!

దేశంలోనే 18 కేసుల్లో స్టేలు తెచ్చుకుని, పొద్దున లేస్తే నేను నిప్పు అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు తుప్పు వదలగొట్టేందుకు ఏసీబీ సిద్ధమైంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మాజీ సీఎం చంద్రబాబుకు హైదరాబాద్‌లోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానం గట్టి షాకే ఇచ్చింది. బాబుగారి అక్రమాస్తులపై 14 ఏళ్ల క్రితం అంటే మార్చి 14, 20005 న ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ ఇచ్చిన స్టేను ఏసీబీ కోర్టు ఎత్తేస్తూ… విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం..ఏదైనా కేసులో పొడిగింపు లేకపోతే 6 నెలలకు మించి స్టే ఉండకూడదు..ఈ నేపథ్యంలో అక్రమాస్తుల కేసుపై చంద్రబాబు తెచ్చుకున్న స్టే గడువు ముగియడం, హైకోర్టు నుంచి ఎలాంటి పొడిగింపు లేకపోవడంతో తదుపరి విచారణ పక్రియ ప్రారంభించాలని…ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి సాంబశివరావు నాయుడు నవంబర్ 18న లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ, దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరుతూ లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రైవేటు పిల్ దాఖలు చేశారు. అయితే ఈ ఫిర్యాదుపై ఏసీబీ కోర్టు పూర్తిస్థాయి విచారణ ప్రారంభించక ముందే చంద్రబాబు ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఫిర్యాదును స్వీకరించడానికి ముందే వాదనలు వినడం సాధ్యం కాదంటూ చంద్రబాబు అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. దీనిపై ఆయన హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి డీఎస్‌ఆర్‌ వర్మ ఏసీబీ కోర్టులో విచారణకు సంబంధించిన తదుపరి చర్యలు నిలిపేస్తూ 2005లోనే స్టే ఉత్తర్వులిచ్చారు. దీంతో బాబు అక్రమాస్తుల విచారణపై ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ లక్ష్మీపార్వతి అనుబంధ పిటిషన్‌ దాఖలు చేయగా, దానిని హైకోర్టు కొట్టేసింది. అప్పటి నుంచి స్టే కొనసాగుతూ వస్తోంది. ఎట్టకేలకు ఏసీబీ కోర్టు బాబు అక్రమాస్తుల కేసుపై విధించిన స్టే ఉత్తర్వులను కొట్టేస్తూ..విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పార్టీలో ఎమ్మెల్యేలంతా రాజీనామాబాటలో ఉండడంతో ఆందోళనలో ఉన్న చంద్రబాబుకు అక్రమాస్తుల కేసుపై విచారణ తిరిగి ప్రారంభడం కావడం మరింత షాక్ ఇచ్చింది. మరి అక్రమాస్తుల కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోతాడా లేడా అన్నది తెలియాలంటే మరి కొంత కాలం వేచిచూడాల్సిందే.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat