ఎప్పుడు ఏదో ఒక అంశంతో మీడియాలో… సోషల్ మీడియాలో ఎక్కువగా సంచలనంగా మారే వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. గత కొంతకాలంగా ఆర్జీవీ పలు వివాదస్పద కథాంశాలనే చిత్రాలుగా తీస్తూ అందరి నోళ్లల్లో నానుతున్నారు ఆర్జీవీ.
తాజాగా ఆయన మరో వివాదస్పద చిత్రం ప్రకటించాడు. ఈ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ” గతంలో నేను విజయవాడ రౌడీలు,రాయలసీమ ఫ్యాక్షనిస్టులపై మూవీలు తీశాను.
నేను 1980ల కాలం నాటి హైదరాబాద్ దాదాలపై చిత్రాన్ని చేయబోతున్నాను .. నా శివ మూవీలాగే ఈ సినిమాను కూడా కొన్ని రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఆధారంగా తెరకెక్కిస్తాను అని “తేల్చి చెప్పాడు. ఈ మూవీలో జార్జిరెడ్డి మూవీ హీరో సందీప్ నటించనున్నాడని ఆర్జీవీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.