Home / MOVIES / అమితాబ్‌ చేతుల మీదుగా రజనీకాంత్‌కు అవార్డు

అమితాబ్‌ చేతుల మీదుగా రజనీకాంత్‌కు అవార్డు

ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) వేడుకలు బుధవారం గోవాలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ప్రారంభోత్సవ వేడుకకు బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్నిబాలీవుడ్‌ దర్శకుడు కరణ్‌ జోహార్‌ హోస్ట్‌ చేశారు. ఈ వేడుకలో రజనీకాంత్‌ను ‘స్పెషల్‌ ఐకాన్‌ ఆఫ్‌ గోల్డెన్‌ జూబ్లీ’తో సత్కరించారు. ఈ  పురస్కారాన్ని అమితాబ్‌ చేతుల మీదుగా అందుకున్నారు రజనీ.

ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ– ‘‘ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డును నాతో పని చేసిన దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులకు అంకితం ఇస్తున్నాను. నాకు ఈ స్థానం కల్పించిన నా అభిమానులకు, తమిళ ప్రజలకు ధన్యవాదాలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెంచ్‌ యాక్టర్‌ ఇజబెల్లా హప్పెట్‌కు లైఫ్‌టైమ్‌ అచీమ్‌మెంట్‌ అవార్డును  అందించారు. నవంబర్‌ 28 వరకూ ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరగనుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat