Home / SLIDER / మరో సారి తన మానవత్వాన్ని చాటుకున్న మంత్రి హారీష్

మరో సారి తన మానవత్వాన్ని చాటుకున్న మంత్రి హారీష్

” మా అమ్మాయి కి చెవులు వినపడవు…మాట రాదు..చికిత్స చేసుకొనే స్థోమత లేదు ఆందోళన తో సతమతమవుతున్న చూస్తుండగా 12 ఏళ్లు గడిచాయి.. నన్ను ఆదుకోవాలి అని సిద్దిపేట గణేష్ నగర్ 22 వ వార్డు చెందిన 12 ఏళ్ల బాలిక లావణ్య తండ్రి రవీంద్ర ప్రసాద్ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారిని కల్సి చెప్పారు… ఎన్నో ఆసుపత్రిలు తిరిగాం. .ప్రయివేటు ఆసుపత్రికి వెళితే 9లక్షలు అవుతాయన్నారు.. మా కుటుంబం రేక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి మాది..ఎదో కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాం..మా కూతరి కి చికిత్స చేపించి సమస్య పరిష్కారం చేయగలరని 22వ కౌన్సిలర్ కెమ్మ సారం ప్రవీణ్ తో కల్సి అమ్మాయి తండ్రి మంత్రి హరీష్ రావు గారి దృష్టికి తెచ్చారు..

మంత్రి హరీష్ రావు  వెంటనే స్పందించి.. హైదరాబాద్ కోటి లో గల ప్రభుత్వ చెవి ,ముక్కు , గొంతు ఆసుపత్రి లో మెరుగైన చికిత్స చేపించే విధంగా వైద్యులతో మాట్లాడారు..ప్రత్యేక వైద్యానికి 6లక్షల రూపాయలు అంచనా వేసి వైద్యులు మంత్రి కి వివరించారు వెంటనే సీఎం సహాయ నిధి ద్వారా ₹5లక్షల రూపాయల ఎల్ ఓసి ని మంజూరు చేసి లావణ్య లేఖ వైద్యానికి మంత్రి హరీష్ రావు  అండగా నిలిచారు…చేయుతనందించారు .

సంబంధిత వైద్యులకు బాలికకు కావాల్సిన మెరుగైన చికిత్స అందించాలని కోరారు.. మరో సారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.. ఈ సందర్భంగా 22వ వార్డు కౌన్సిలర్ కెమ్మ సారం ప్రవీణ్ మాట్లాడుతూ” ఎన్నో ఆసుపత్రిలు తిరిగాం… ఆర్థిక స్థోమత లేదు 12 ఏళ్ళు గడిచాయి…ఆందోళన గా ఉన్న మా కుటుంబం లో వైద్యో నారాయణో హరి అనే మాట విన్నాం..మంత్రి హారీష్ లో నారాయణ దేవుణ్ణి చూశాం.. మా కూతరి వైద్యానికి ఆర్థిక సహాయం అందించిన మంత్రి హారీష్  కు మేము ఎల్లప్పుడూ ఋణపడి ఉంటామని బాలిక తల్లిదండ్రులు అన్నారు…మా వార్డు చెందిన పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మంత్రి హారీష్  కు కృతజ్ఞతలు తెలిపారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat