Home / SLIDER / ప్రతి ధాన్యపు గింజను కొంటాం

ప్రతి ధాన్యపు గింజను కొంటాం

రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ప్రతి ధాన్యపు గింజను కొంటామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.శనివారం దామెర మండలం సింగరాజుపల్లి గ్రామంలో ఐకెపి వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరిదాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించడం కోసం వేలకోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నారు.అందుకు అనుగుణంగా రైతులు ధాన్యాన్ని తేమలేకుండా తీసుకురావాలన్నారు.ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1835,సాదారణ ధాన్యానికి రూ.1815 ధర చెల్లిస్తుందన్నారు.మధ్య దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని కోరారు.మధ్య దళారులు ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.గత ప్రభుత్వాలు వ్యవసాయం దండగ చెప్పితే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా చేశారన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని రైతుబంధు కేసీఆర్ తెలంగాణలో అమలుచేశారు.తెలంగాణలో కోటి ఎకరాలు సాగుచేసే విధంగా ప్రాజెక్టులు కట్టుకొని ముందుకెళ్తున్నామని చెప్పారు.రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమపథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదన్నారు.రైతులకు అండగా నిలిచిన కేసీఆర్..భూతగాధాలనుంది రైతులను విముక్తి చేయడానికే సమగ్ర భూ సర్వే, సాదాబైనామా.అందులో భాగంగానే ఈ రోజు దామెర మండలంలో 90 శాతం భూమి సమస్యల పరిష్కారం.అందుకు కృషి చేసిన రెవెన్యూ సిబ్బందికి కృతజ్ఞతలు.మిగతా 10 శాతానికి కూడా రైతులు రెవెన్యూశాఖ సిబ్బందికి సహకరించాలి.100 శాతం పూర్తి చేసుకొన్న ఆదర్శవంత మండలంగా దామెర మండలం నిలవాలి.రాష్ట్రం ఏర్పడ్డాక రైతులకోసం 24 గంటల నాణ్యమైన కరెంటు,రైతుబంధు ద్వారా పంటపెట్టుబడి,రైతుభీమా,ఎరువులు అందుబాటులో పెట్టిన ఘనత కేసీఆర్ గారిదన్నారు.

ఈ రోజు రైతు బంధు పథకం ద్వారా పంటపెట్టుబడి ఇస్తున్నందున పడా భూములన్నీ సాగులోకి వచ్చింది అన్నారు.ఈ రోజు వరిధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం మంచి మద్దతుదర ఇస్తుంటే,అదే రైతు పండించిన పత్తికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు గిట్టుబాటు ధర ఇవ్వడంలేదని ప్రశ్నించారు.పత్తికి మద్దతు లేక రైతులు పడుతున్న ఇబ్బందులు ఈ బిజెపి నాయకులకు కనిపిస్తలేదా,ఎందుకు కేంద్రాన్ని అడగడం లేదని బిజెపి నాయకులకు ప్రశ్నించారు.ఈ రోజు ఆర్టీసీ కార్మికుల జీవితాలను చీకట్లోకి నెట్టి వారిని రోడ్డుపైన పడేసింది ఈ బిజెపి నాయకులే అన్నారు.మీకు రైతుల సంక్షేమం గురించి ఆలోచించే వారైతే,మీకు దమ్ముంటే పత్తికి రూ.7 వేలు మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్నీ అడిగి ఇప్పించగలరా అని ప్రశ్నిoచారు.నిత్యం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కృషి చేసే కేసీఆర్ పైన దుష్ప్రచారం చేయడం మానుకోవాలని ప్రతిపక్షాలకు ఆయన హెచ్చరించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat