దేవదాసు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ ఇలియానా.. ఈ మూవీలో ఒకవైపు అద్భుతమైన నటనను ప్రదర్శిస్తూనే .. మరోవైపు అందాలను ఆరబోస్తూ ప్రశంసలు పొందుకుంది ఈ గోవా బ్యూటీ. ఆ తర్వాత వరుస విజయాలతో ఇండస్ట్రీలో ఒక్కసారికి టాప్ రేంజ్ కు చేరుకుంది ఈ బక్కపలచు భామ. అయితే ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
దీంతో నేను బాలీవుడ్ లోనే నటిస్తానని తెగించి చెప్పి అవకాశాల కోసం అక్కడే ఉంది ఈ ముద్దుగుమ్మ. ఈ తరుణంలో విదేశీ ఫొటోగ్రాఫర్ అండ్రూతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. దీంతో ఒకపక్క వరుస ఫ్లాప్ లు.. మరోవైపు అండ్రూతో ప్రేమయాణంతో అమ్మడుకు అవకాశాలు తగ్గాయి.
ఆ తర్వాత అమ్మడుకు అండ్రూ బ్రేకఫ్ చెప్పాడు. దీంతో చేసేది లేక మరల టాలీవుడ్ లోకి ఎంట్రీస్తూ మాస్ మహారాజ్ రవితేజ సరసన నటించిన `అమర్ అక్బర్ ఆంటోని` చిత్రం కూడా ఫ్లాప్ కావడం తో అమ్మడు చాలా మానసికంగా కృంగిపోయింది. ఒకవైపు అవకాశాల్లేక.. మరోపక్క ప్రేమించినోడు దూరం కావడంతో ఏమి చేయలేక ఆత్మహాత్యం చేసుకోవాలని అనుకున్నాను అని ఆమె ఒక ప్రముఖ పత్రికకిచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నది.