తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను టీమిండియా మాజీ కెప్టెన్,లెజండ్రీ ఆటగాడు కపిల్ దేవ్ ఈ రోజు సోమవారం ఉదయం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ ఆఫీసులో కలిశారు.
ఈ సందర్భంగా పలు అంశాలపై మంత్రి కేటీఆర్‌తో కపిల్ దేవ్ చర్చించారు. ఈ భేటీలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు పలువురు ఉన్నారు.