ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి మెగా ఫ్యామిలీపై పడ్డాడు. ఈసారి ఏకంగా పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్,మెగా స్టార్ చిరంజీవి గురించి ఆర్జీవీ వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ” మెగా ఫ్యామిలీపై నాకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు. మెగా కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం. మెగా స్టార్ చిరంజీవి అంటే ఎనలేని అభిమానం.. మర్యాద ఉంది.
చిరు కష్టపడి పైకి వచ్చాడు.టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ అంటే మెగా ఫ్యామిలీ. అందుకే వాళ్లపై నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. ఎక్కడ ఎవరు బిగ్గెస్ట్ అయితే వాళ్ల గురించే కదా మనం మాట్లాడతాం. మరోవైపు హీరో పవన్ కళ్యాణ్ అంటే మోస్ట్ సిన్సియర్ అని తాను భావిస్తానని”ఆర్జీవీ చెప్పుకొచ్చాడు.