Home / MOVIES / జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త

టాలీవుడ్ స్టార్ హీరో.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు నిజంగా ఇది శుభవార్త. సరిగ్గా పన్నెండు ఏళ్ల కిందట ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మ్యూజిక్ మ్యాస్ట్రో ఎంఎం కిరవాణి సంగీతమందించి.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన మూవీ యమదొంగ.

ఈ చిత్రం అప్పట్లో పెనుసంచలనం సృష్టించి.. ఇండస్ట్రీని షేక్ చేస్తూ ఘన విజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ మూవీ ఇప్పుడు విజయన్ పేరుతో కోలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కనున్నది. దాదాపు పన్నెండేళ్ల తర్వాత యమదొంగ మూవీ తమిళంలో అనువాదం అవుతుండటం విశేషం.

ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్‌ కథను అందించిన ఈ చిత్రానికి కేకే.సెంథిల్‌కుమార్‌ ఛాయాగ్రహణాన్ని అందించాడు. ఓం శ్రీసప్త కన్నీయయ్యన్‌ క్రియేషన్‌ పతాకంపై ఎం.జయకీర్తి, రేవతి మేఘవన్నన్‌లు అనువదిస్తున్నారు. దీనికి అనువాద రచయిత బాధ్యతలను ఏఆర్‌కే.రాజరాజా నిర్వహిస్తున్నారు. డిసెంబర్‌ 13వ తేదీన విడుదల చేయడానికి చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat