Home / ANDHRAPRADESH / స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు..లోకేష్, అచ్చెన్నాయుడులకు ప్రివిలేజ్ నోటీసులు..!

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు..లోకేష్, అచ్చెన్నాయుడులకు ప్రివిలేజ్ నోటీసులు..!

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్, ఎమ్మెల్యే అచ్చెంనాయుడు, మరో టీడీపీ నేత కూన రవికుమార్‌లకు సభా హక్కుల ఉల్లంఘన కింద..అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. కాగా అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వ సాయం అందజేస్తున్న సమయంలో స్పీకర్ తమ్మినేని అగ్రిగోల్డ్ ఆస్తులను, హాయ్‌ల్యాండ్‌ను లోకేష్‌ కొట్టేయాలని ప్రయత్నించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై అచ్చెంనాయుడు, కూన రవికుమార్ స్పందిస్తూ..అసభ్య పదజాలంతో స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళంలో స్పీకర్ నేతృత్వంలోనే ఇసుక మాఫియా జరుగుతోందని కూన విమర్శించారు. అంతే కాదు మీదీ ఒక బతుకేనా? శాసనసభలో అంబోతు, దున్నపోతులా నిద్రిస్తున్నావ్‌.. వాడు, వీడు..అంటూ తెలుగుదేశం పత్రికలో స్పీకర్ తమ్మినేనిని అవమానిస్తూ.. కథనాలు ప్రచురించారు. లోకేష్ అయితే ఏకంగా తమ్మినేనికి లేఖ రాసి పలు అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇంటి ముందు చొక్కావిప్పుకుని ఒంటిపై పెట్రోలు పోసుకుని నానా రచ్చ చేసింది ఎవరూ అంటూ తమ్మినేనిని లోకేష్ కించపరిచాడు. దీంతో అనుచిత వ్యాఖ్యలతో స్పీకర్ ఛైర్‌ను అగౌరవపరిచారని, ఈ ముగ్గురి టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాల్సిందిగా వైసీపీ నేతలు ప్రభుత్వ చీఫ్ విప్, గడికోట శ్రీకాంత్ రెడ్డి, మల్లాది విష్ణు తదితరులు స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన అసెంబ్లీ కార్యదర్శి..ఈ ముగ్గురికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేశారు.

కాగా డిసెంబర్ 9 నుండి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈలోగా లోకేష్, అచ్చెంనాయుడుల నుంచి సమాధానాలు తీసుకోవాలని స్పీకర్ కార్యాలయం భావిస్తోంది. అయితే ప్రివిలేజ్ నోటీసులకు ఇచ్చిన సమాధానంతో స్పీకర్ సంతృప్తి చెందితే క్షమించి వదిలేస్తారు. ఒక వేళ స్పీకర్ సంతృప్తి చెందకపోతే ఈ మొత్తం వ్యవహారాన్ని మళ్లీ ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేసే అవకాశం ఉంది. అదే సమయంలో మూడ్ ఆఫ్ ది హౌస్ గా ప్రభుత్వంతో సహా ఇతర పక్షాల అభిప్రాయాలను సైతం స్పీకర్ సేకరించే అవకాశం ఉంటుంది. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో సీఎం పైన అనుచిత వ్యాఖ్యలపై విచారణ జరిపిన ప్రివిలేజ్ కమిటీ సిఫార్స్ మేరకు వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఏడాది కాలం పాటు సస్పెండ్ చేసారు. మరి ఇప్పుడు అదే తరహాలో స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన లోకేష్, అచ్చెన్నాయుడులపై చర్యలు తీసుకునే అవకా‎శం ఉంది. మరి లోకేష్, అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పి ఈ వివాదానికి ముగింపు పలుకుతారో..లేకుంటే మొండిగా వ్యవహరించి సస్పెండ్ అయి రాజకీయం చేస్తారో చూడాలి. ఎందుకంటే సంక్షోభాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చు‌కోగల కుటిల రాజకీయవేత్త చంద్రబాబు కనుక..స్పీకర్‌కు క్షమాపణ చెప్పడం కంటే..కావాలని సస్పెండై రాజకీయంగా ప్రభుత్వంపై బురద జల్లే అవకాశం కూడా ఉంది. మరి అసెంబ్లీలో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat