తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం పలు రంగాల్లో నెంబర్ వన్ స్థానంలో నిలుస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ నిలిచింది.
అయితే దేశ వ్యాప్తంగా కరెంటు కొనుగోలు చేస్తోన్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రానికి నాలుగో స్థానం దక్కింది అని కేంద్ర విద్యుత్ సంస్థ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది. బీహార్ ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది..
పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో నిలిచింది. ఇక మూడో స్థానంలో ఛత్తీస్ గఢ్ ఉంది. పక్కనున్న ఏపీకి పదో స్థానం దక్కింది.