Home / ANDHRAPRADESH / బూతుల గురించి నువ్వు మాట్లాడితే ఎలా బోండా.. నీ బూతు పురాణం రాష్ట్రం మొత్తం చూసిందిలే..!

బూతుల గురించి నువ్వు మాట్లాడితే ఎలా బోండా.. నీ బూతు పురాణం రాష్ట్రం మొత్తం చూసిందిలే..!

చంద్రబాబు, టీడీపీ నేతల విమర్శలకు ప్రతిగా మంత్రి కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచేస్తున్నాయి. బాబును ఉద్దేశించి నాని చేస్తున్న పరుష వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా అమరావతిలో చంద్రబాబు పర్యటనపై మాట్లాడిన కొడాలి నాని..రాజధానిలో ప్రస్తుతం కుక్కలు, గొర్రెలు, మేకలు, దున్నపోతులు తిరుగుతున్నాయని, వాటితో పాటే రాజధానిలో తిరిగేందుకు చంద్రబాబు వస్తున్నారా అంటూ తీవ్ర విమర్శలు చేశారు. కాగా నాని వ్యాఖ్యలపై టీడీపీ నేత బోండా ఉమ స్పందించాడు. బూతుల మంత్రి కొడాలి నాని ప్రజల మనోభావాలు దెబ్బ తీసేలా మాట్లాడుతున్నారన్నారని బోండా ఉమ విమర్శించారు. సీఎం జగన్ వెంటనే స్పందించి మంత్రులను అదుపులో పెట్టుకోవాలని.. లేదంటే బూతులు తిట్టడానికి ఒక శాఖను కేటాయించాలంటూ బోండా ఉమ ఓ రేంజ్‌లో రెచ్చిపోయాడు. వైసీపీ వాళ్లలా రౌడీల్లాగా..‌ వీధి భాష తాము మాట్లాడలేదని బోండా ఉమ సెలవిచ్చారు. బోండా ఉమ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయాలపై ఆగ్రహంతోనే మంత్రి నాని పరుషవ్యాఖ్యలు చేస్తున్నాడని..కాని ఎక్కడా నీకులాగా బూతులు మాట్లాడలేదు బోండా అంటూ వైసీపీ నేతలు అంటున్నారు. నిండు అసెంబ్లీలో కొడాలి నానిని పట్టుకుని ఏంట్రా..ఏంట్రరేయ్..పాతేస్తా నా కొ..కా..అని బూతులు మాట్లాడిన సంగతి మర్చిపోయావా బోండా అంటూ నిలదీస్తున్నారు. అసెంబ్లీలో తోటి శాసనసభ్యురాలు అన్న గౌరవం కూడా లేకుండా ఎమ్మెల్యే రోజాను ఆంటీ అంటూ వెకిలిగా మాట్లాడావు..సినిమాల్లో బికినీలు వేసినట్లు విశాఖ బీచ్ ఫెస్టివల్‌కు వస్తే చర్యలు తప్పవు అంటూ రోజాపై చేసిన అసభ్యవ్యాఖ్యలు చేసిన నువ్వు కూడా బూతులు మాట్లాడితే ఎలా బోండా అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నువ్వు చేస్తే సంసారం..ఎదుటోడు చేస్తే వ్యభిచారం..ఇదే కదా మీ చంద్రబాబు సిద్ధాంతం..అయినా కొడాలి నాని కాస్త పరుషంగా మాట్లాడాడు కాని..నీకులాగా బూతులు తిట్లలేదు..ఆయినా బూతుల గురించి నువ్వు మాట్లాడితే ఎలా బోండా..నీ బూతు పురాణం రాష్ట్రం మొత్తం చూసిందిలే అంటూ వైసీపీ నేతలు ఉమపై సెటైర్లు వేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat