Home / TELANGANA / మహిళలూ.. ‘హాక్‌-ఐ’ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి

మహిళలూ.. ‘హాక్‌-ఐ’ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి

ఆపత్కాలంలో ఉన్న మహిళలు తక్షణ సాయం కోసం కొన్ని మొబైల్‌ నంబర్లను ఫోన్‌లో సేవ్‌ చేసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. వాటి వివరాలిలా ఉన్నాయి..

డయల్‌-100: ఈ నంబరుకు ఫోన్‌ చేస్తే.. కంట్రోల్‌ రూం సిబ్బంది వెంటనే ఫిర్యాదును నమోదు చేసుకుని, సంబంధిత పోలీసు సిబ్బందిని ఘటనాస్థలికి పంపుతారు.

వాట్సాప్‌ ఫిర్యాదులకు: 9490616555(హైదరాబాద్‌), 9490617444(సైబరాబాద్‌), 9490617111(రాచకొండ). పోలీసులు 24 గంటలూ ఈ నంబర్లకు వచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తారు.

ఔటర్‌పై: ఔటర్‌ రింగ్‌రోడ్‌పై వెళ్తున్నప్పుడు ఆపద వస్తే.. 7901099445 నంబరుకు నేరుగా ఫోన్‌ చేయవచ్చు. వెంటనే ఔటర్‌పై ఉండే పెట్రోలింగ్‌ సిబ్బంది అక్కడికి చేరుకుంటారు. దీంతోపాటు ఔటర్‌పై అక్కడక్కడా ఉండే ‘ఎస్‌వోఎస్‌’ ఫోన్‌ బూత్‌లను వాహనాల బ్రేక్‌డౌన్‌, ఫిర్యాదుల కోసం వాడుకోవచ్చు.

మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీసులు విడుదల చేసిన ‘హాక్‌-ఐ’ యాప్‌ ఉంటే.. తమనుతాము కాపాడుకునేందుకు చేతిలో ఓ ఆయుధం ఉన్నట్లేనని పోలీసులు చెబుతున్నారు. ఆపదలో ఉన్నప్పుడు.. ఈ యాప్‌లోని బజర్‌ నొక్కితే.. క్షణాల్లో పోలీసులకు సమాచారం అందుతుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat