Home / SLIDER / ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ పరిధిలోని షాద్ నగర్ లో వెటర్నీ డాక్టర్ ప్రియాంకరెడ్డి అత్యాచారం మరియు హత్య సంఘటన యావత్తు దేశమంతా సంచలనం రేకెత్తించిన సంగతి విదితమే. ఇప్పటికే పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన నలుగురు నిందితులను పట్టుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిందితులకు త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ఆదేశించారు. అయితే ప్రియాంకరెడ్డి హత్య సంఘటనపై దేశ వ్యాప్తంగా సామాన్య ప్రజానీకం దగ్గర నుండి ప్రముఖుల వరకు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తన అధికారక ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ” ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారిని పిచ్చికుక్కలతో సమానం.

అలాంటివార్ని చంపాలని డిమాండ్ చేయడం సమయం వృధా తప్పా ఏమి లాభముండదు. ఆ సమయాన్ని మహిళలకు ఎలా రక్షణ కల్పించాలనే అంశంపై ఆలోచిస్తే” బాగుంటుందన్నారు.ఆ డిమాండ్లను ప్రసారం చేసే బదులు.. బాధితురాలిపై కథనాలను ప్రసారం చేసే బదులు ఇలాంటి దారుణాలపై ప్రశ్నించేవార్ని టీవీల్లో ప్రసారం చేయాలి. సైకియాట్రిస్టులు ,సోషల్ మీడియా సైంటిస్టులు వాళ్లను ప్రశ్నించడం ద్వారా వాళ్లలో అలాంటి రాక్షస నేరప్రవృత్తి ఏలా వచ్చిందో తెలుసుకునే అవకాశం ఉంటుంది.అసలు వీళ్లు ఎందుకు అంతలా దుర్మార్గంగా ఎలా..ఎందుకు ఆలోచించారు.? అని తెలుసుకుంటే భవిష్యత్తులో రేపిస్ట్‌లను ముందే పసిగట్టే అవకాశం ఉంటుందని అన్నారు.

ఇప్పటివరకు దేశంలో జరిగిన ఈ సంఘటనల్లో ఏ రేపిస్ట్‌ కూడా గత అనుభవాల నుంచి ఏం నేర్చుకోరు. 2012లో జరిగిన నిర్భయ ఘటన నుంచి ఇప్పటి వరకు మనం ఇదే నేర్చుకున్నాం. ఎందుకంటే వాళ్లకు గతం నుంచి భయం నేర్చుకునేంత మెంటల్‌ కెపాసిటీ ఉండదు. ఓ పిచ్చి కుక్క గతంలో మరో పిచ్చి కుక్కపై జరిగిన దాడిని చూసి ఏం నేర్చుకుంటుంది. నా ఉద్దేశం వెటర్నరీ డాక్టర్‌ హత్య చేసిన దుర్మార్గలను పిచ్చి కుక్కలు అని వదిలి పెట్టాలని కాదు. రేపిస్ట్‌లను సమాజానికి చేసిన జబ్బులా భావించి ఆ రోగాన్ని ఎలా తగ్గించాలన్న విషయంలో శాస్త్రీయంగా పరిశోదన జరపాలి. అప్పుడే మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించగలం. ఒక పామును ముక్కలుగా నరికితే మరో పాము మన దగ్గరికి రాకుండా ఉండదు. ఎందుకంటే వాటికి అంత ఆలోచనా శక్తి ఉండదు’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat