Home / ANDHRAPRADESH / తిరుమలపై మరోసారి పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు..!

తిరుమలపై మరోసారి పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు..!

తిరుమల తిరుపతి వేంకటశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల పవిత్రత దెబ్బతినేలా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల డిక్లరేషన్ అంటూ చంద్రబాబు సీఎం జగన్‌పై ఆరోపణలుచేస్తుంటే పవన్ కల్యాణ్ పదపదే సీఎం జగన్ మతం, కులంను టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నాడు. తాజాగా తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుందంటూ..పవన్ కల్యాణ్ కొత్త వాదన ఎత్తుకున్నాడు. ఇవాళ తిరుమలలో పర్యటించిన పవన్ మతమార్పిడుల అంశంపై స్పందించాడు. ఎక్కడైనా హిందూ ధర్మానికి నష్టం జరిగితే తప్పకుండా స్పందిస్తాను. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాత మార్పిడులు జరుగుతుంటే సీఎం జగన్‌కు తెలియవా? ఎవరి అండ చూసుకొని మత మార్పిడులు జరుగుతున్నాయి…మీ ఓట్ల బ్యాంకు రాజకీయాలు తగవని పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు.  అయితే తిరుమలలో మతమార్పిడులు జరుగుతున్నాయంటూ..పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. కేవలం సీఎం జగన్‌పై క్రిస్టియన్ ముద్ర వేసి, హిందూవులను వైసీపీకి దూరం చేసేందుకే..పథకం ప్రకారం పార్టనర్లు ఇద్దరూ తిరుమలపై, టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. గతంలో తిరుమలలో బస్ టికెట్లపై అన్యమత్ర ప్రచారం, శేషాచలం కొండల్లో చర్చి అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన టీడీపీ కుట్ర బట్టబయలైంది. అయినా పదే పదే టీటీడీ, తిరుమత ప్రతిష్ట మంటగలిసేలా చంద్రబాబు, పవన్‌లు విమర్శలు చేస్తున్నారు. టీటీడీ వెబ్‌సైట్‌లో, క్యాలెండర్‌లో యేసయ్య పదం అంటూ బాబుగారి కుల పత్రిక చంద్రజ్యోతి అసత్యకథనం ప్రచురించింది. టీటీడీ ఛైర్మన్ వివరణ ఇచ్చి..సదరు పత్రికపై కేసు పెడతామని హెచ్చరించారు. అంతే కాదు ఇంగ్లీష్ మీడియంతో రాష్ట్రంలో మతమార్పిడులు చేయించేందుకు కుట్ర చేసిందని…పచ్చ పత్రిక మరో అసత్య కథనం ప్రచురించింది. తాజాగా పవన్ కల్యాణ్  తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుంటే..సీఎంకు తెలియవా అంటూ విమర్శలు గుప్పించాడు. దీన్ని బట్టి పథకం ప్రకారమే చంద్రబాబు, ఎల్లోమీడియా, పవన్ కల్యాణ్‌లు పదేపదే తిరుమల, టీటీడీ ప్రతిష్ట మసకబారేలా రోజుకో తీరుగా దుష్ప్రచారం చేస్తున్నారని..వైసీపీ నేతలు అంటున్నారు. ఇక మీ ఓట్ల రాజకీయం కోసం…తిరుమల పవిత్రతను, కోట్లాది మంది వెంకన్న భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ బాబు, పవన్‌లపై ఏపీ ప్రజలు మండిపడుతున్నారు.మొత్తంగా తిరుమలలో మతమార్పిడులు అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat