సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి భరిలో చిత్రం వస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటివరకు విడుదలైన విజువల్స్ లో చూస్కుంటే మహేష్ ఆర్మీ ప్యాంటు లోనే కనిపించాడు. దాంతో మహేష్ ను నెటీజన్లు స్క్రోల్ చేయడం మొదలుపెట్టారు. మరోపక్క వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా వెంకీ మామ డిసెంబర్ 13న విడుదల కానుంది. ఇందులో చైతు కెప్టెన్ కార్తీక్ పాత్రలో నటిస్తున్నాడు. దీనికి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. అయితే దీనివల్ల మహేష్ కు దెబ్బపడే అవకాశం ఉందా అనేది ఇప్పుడు తెలియాలి.