Home / ANDHRAPRADESH / బెత్తం దెబ్బల ఎఫెక్ట్..దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై పవన్ కల్యాణ్ ఏమన్నాడో తెలుసా..!

బెత్తం దెబ్బల ఎఫెక్ట్..దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై పవన్ కల్యాణ్ ఏమన్నాడో తెలుసా..!

దిశ హత్య కేసులో నలుగురు నిందితులు చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో మరణించడంతో యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. అయితే రెండు రోజుల క్రితం దిశపై జరిగిన అమానుష హత్యాకాండపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..హైదరాబాద్‌లో అత్యాచారం చేసిన నిందితులను వేల మంది వచ్చేసి…చంపేయాలంటున్నారు..రేప్ చేస్తే నాలుగు బెత్తం దెబ్బలు వేసి చర్మం వూడేలా కొట్టండి కాని…నిందితులను చంపే ‍‍హక్కు లేదంటూ..వివాదాస్పద  వ్యాఖ్యలు చేశాడు. దిశ ఘటనపై పవన్ చేసిన వ్యాఖ్యలపై మహిళలు, నెట్‌జన్లు మండిపడ్డారు. ఏం మాట్లాడుతున్నావ్ పవన్..ఇంతటి దారుణకాండకు పాల్పడిన నిందితులను సత్వరమే ఉరి తీసేలా చట్టాలను రూపొందించమని చెప్పేది పోయి రెండు బెత్తం దెబ్బలు వేస్తే చాలని మాట్లాడుతున్నావ్..మహిళల మాన, ప్రాణాల మీద గౌరవం లేదా..అంటూ పవన్‌‌‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెత్తం దెబ్బల వ్యాఖ్యల ఎఫెక్ట్‌తో పవన్ వెనక్కి తగ్గాడు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జనసేన పార్టీ దిశ ఉదంతం కనువిప్పు కలగాలి – బహిరంగ శిక్షలు అమలు చేయాలి అంటూ ఓ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. దిశ ఉదంతం మన ఆడపడుచుల రక్షణకు ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని హెచ్చరిస్తోంది. ఆ కరాళ రాత్రి వేళ నలుగురు ముష్కరుల మధ్య దిశ ఎంతటి నరకాన్ని చూసిందో తలుచుకుంటేనే ఆవేశం, ఆక్రోశం, ఆవేదనతో శరీరం ఉడికిపోతుంది. జాతి యావత్తు తక్షణ న్యాయం కోరుకోవడానికి కారణం ఈ ఆవేదన. దిశ సంఘటన ముగిసిందని దీనిని మనం ఇంతటితో వదిలిపెట్టకూడదు. మరే ఆడబిడ్డకు ఇటువంటి పరిస్థితి రాకూడదు. నిర్భయ ఉదంతం తర్వాత బలమైన చట్టాన్ని మన పార్లమెంట్ తీసుకువచ్చింది. అయినా అత్యాచారాలు ఆగలేదు.అంటే ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని జరుగుతున్న సంఘటనలు తెలుపుతున్నాయి. ఆడపిల్లల వైపు వక్రబుద్ధితో చూడాలంటేనే భయపడే విధంగా కఠినాతి కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. రెండు, మూడు వారాల్లోనే శిక్షలు పడే విధంగా నిబంధనలు రావాలి. ఆడపడుచుల శ్రేయస్సు దృష్ట్యా శిక్షలు బహిరంగంగా అమలు చేయడానికి యోచన జరగాలి. నేరస్థాయిని బట్టి..అది మరణ శిక్ష అయినా..మరే ఇతర శిక్ష అయినా సరే బహిరంగంగా అమలు జరపాలి. ప్రజలు కోరుకున్న విధంగా దిశ ఉదంతంలో సత్వర న్యాయం లభించింది. ఈ సందర్బంగా దిశ ఆత్మకు శాంతి కలగాలని, ఈ విషాదం నుంచి ఆమె తల్లిదండ్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను..అంటూ పవన్ కల్యాణ్ పేరుతో జనసేన పార్టీ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. మొత్తంగా బెత్తం దెబ్బల వ్యాఖ్యల నేపథ్యంలో చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌‌ను వ్యతిరేకిస్తూ పవన్ కామెంట్స్ చేస్తాడేమోనని మీడియా వర్గాలతో సహా అందరూ అనుకున్నారు. కానీ బెత్తం దెబ్బల వ్యాఖ్యలకు నిరసన ఎదురవడంతో దిశనిందితుల ఎన్‌కౌంటర్‌ను పవన్ కల్యాణ్ సమర్థించక తప్పలేదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat