Home / ANDHRAPRADESH / అసెంబ్లీ సమావేశాలకు విమర్శనాస్త్రాలతో కుస్తీ పడుతున్న చంద్రబాబు అండ్ టీం.

అసెంబ్లీ సమావేశాలకు విమర్శనాస్త్రాలతో కుస్తీ పడుతున్న చంద్రబాబు అండ్ టీం.

ఇప్పటి వరకు ప్రతిపక్షనేత , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రం లో చేసిన పర్యటనలు, ప్రభుత్వ పనితీసుపై ఆయన చేసిన పరిశీలనల ఆధారంగా..ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలలో జగన్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి 21 అంశాలను తెలుగుదేశంపార్టీ ఎంపక చేసుకుంది. బిసిలపై ప్రబుత్వం కక్ష సాదిస్తోందని ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించాలని నిర్ణయించారు. టిడిపి ఎల్పి సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. కాపు మహిళలకు ఇచ్చే 15వేలు ఆర్థికసాయం బీసీ మహిళలకు ఎందుకు ఇవ్వట్లేదని అడగాలని వారు బావించారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో
టిడిపి జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం, అక్కడే చంద్రబాబు అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఉల్లి, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, తెదేపా శ్రేణులపై తప్పుడు కేసులు, ఇసుక కొరతతో భవననిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, ఆంగ్ల మాధ్యమం బలవంతపు మతమార్పిడి, రైతు రుణమాఫీ 4, 5 విడతలు ఎగ్గొట్టడం, గ్రామ సచివాలయ ఉద్యోగాలు, వాలంటీర్ల నియామకాల్లో అక్రమాలు, మీడియాపై ఆంక్షల వంటి అంశాలపై చర్చించి ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఉల్లితో పాటు, నిత్యావసర ధరల పెరుగుదలపై సమావేశాల మొదటిరోజే వాయిదా తీర్మానం ఇస్తామని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ జి.శ్రీనివాసులు మీడియాకు తెలిపారు. అయితే ఎమ్మెల్యేలంతా ఈ మీటింగ్ కు మాజరు అయ్యారా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఈ సమయంలో తమ ఎమ్యెల్యేలు పార్టీ మారి తనకు ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా చేస్తారనే భయం ఒకవైపు ఉండగా రానున్న ఎమ్ఎల్సి ఎలక్షన్ నోటిఫికేషన్ లో తన తనయుడి సీటుకు ఎసరువస్తుందేమో అన్న ఆందోళనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతే గాక రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు సీఎం జగన్ పాలనకు ఆకర్షితులై వైఎస్సార్సీపీ లోకి వలసలు వెళ్లడంతో పార్టీ క్యాడర్ ను ఎలా కాపాడుకోవాలో తెలియక చంద్రబాబు సతమతమవుతున్నట్లు సమాచారం

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat