టీమిండియా కెప్టెన్ ,పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో రికార్డును తన సొంతం చేసుకున్నాడు. తిరువనంతపురంలో ఆదివారం జరిగిన రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో పర్యాటక జట్టైన వెస్టిండీస్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్ 1-1తో సమానం చేసిన సంగతి విదితమే.
ఈ మ్యాచ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ పంతొమ్మిది పరుగులు చేయడంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచాడు.
రోహిత్ శర్మ (2562)అత్యధిక పరుగుల రికార్డును కోహ్లీ(2563)బద్దలు కొట్టాడు. అయితే ప్రస్తుతం విరాట్ ,కోహ్లీ మధ్య పరుగుల తేడా కేవలం ఒక్క పరుగు ఉండటం విశేషం..