Home / POLITICS / ఖనిజ సంక్షేమ నిధులను ప్రాధాన్యతా రంగాలకు ఖర్చు చేయాలి..మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ఖనిజ సంక్షేమ నిధులను ప్రాధాన్యతా రంగాలకు ఖర్చు చేయాలి..మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

జిల్లా ఖనిజ అభివృద్ధి నిధిలో ఉన్నటువంటి నిధుల ద్వారా జిల్లాలోని మూడు నియోజక వర్గాల్లో అత్యంత ప్రాధాన్యత అంశాలకు ఖర్చు చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ మరియు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఖనిజ ఫౌండేషన్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా ఖనిజ సంక్షేమ నిధి లో నిలువ ఉన్న నిధులతో జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన పనులను చేపట్టాలని ఆయన తెలిపారు. జిల్లా ఖనిజాభివృద్ధి నిధిలో 3 కోట్ల 44 లక్షల 57 వేల రూపాయలు జమా ఉన్నాయని అట్టి నిధుల నుండి 85 శాతం మేరకు మైనింగ్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలో రహదారులు, పాఠశాలల్లో అదనపు గదులు ప్రహరీ గోడ నిర్మాణం, త్రాగునీటి సౌకర్యం, ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాల కు వైట్ వాష్, ట్రాఫిక్ సిగ్నల్స్ కు, వైద్య ఆరోగ్య శాఖ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైట్ వాష్, చెరువుల మరమ్మతు, అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు, బాల సదన్, వృద్ధాశ్రమం, ప్రభుత్వ పాఠశాలల కు ప్రహరీ గోడ, పాఠశాలల్లో క్రీడ సౌకర్యాలు, చెరువుల మరమ్మతు తదితర అంశాలను చేపట్టుటకు కమిటీ తీర్మానం చేయడం జరిగింది. అలాగే జిల్లాలో 21.27 కోట్ల రూపాయలతో చేపట్టిన18 పనులకు,18 కోట్ల రూపాయలతో చేపట్టిన రహదారుల పనులకు ఆమోదం తెలిపింది.

జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో 17 క్వారీలు ఉన్నాయని తెలిపారు. ఈ క్వారీల లీజుకు ఇవ్వడం ద్వారా అక్టోబర్ 2015 సంవత్సరం నుండి అక్టోబర్ 2019 వరకు 3 కోట్ల 44 లక్షల 57 వేల రూపాయలు జిల్లా ఖనిజ అభివృద్ధి నిధి లో జమ అయ్యాయని తెలిపారు. ఈ ఈ నిధుల నుండి 85 శాతం మేరకు జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు . జిల్లా ఖనిజ సంస్థ నిధుల ద్వారా జిల్లాలోని నిర్మల్ నియోజకవర్గం లో 10 పాఠశాలలో అదనపు తరగతి గదులు, ముధోల్ నియోజకవర్గం లోని 6 పాఠశాలల్లో అదనపు గదులు నిర్మించనున్నట్లు, పాఠశాలల్లో త్రాగునీటి సౌకర్యం, ప్రహరీ గోడ నిర్మాణం, క్రీడా సౌకర్యాలు, రహదారుల నిర్మాణం, చెరువుల మరమ్మతు, ఎస్సీ బీసీ వసతి గృహాలకు వైట్వాష్, వృద్ధాశ్రమం, బాల సదనం, 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైట్ వాష్ చేయుటకు కమిటీ తీర్మానం చేసిందన్నారు.

ఈ సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ కొరిపల్లి విజయలక్ష్మి, ముధోల్ శాసనసభ్యులు విట్టల్ రెడ్డి, ఎఫ్ ఎస్ సి ఎస్ సి చైర్మన్ రామ్ కిషన్ రెడ్డి, జడ్పీటీసీలు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ర, జీవన్ రెడ్డి జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్ సుభాష్ రావు, ఎంపీపీ మహిపాల్ రెడ్డి, జిల్లా అటవి అధికారి ప్రసాద్, జిల్లాగనులు, ఖనిజ అభివృద్ధి అధికారి క్రాంతి కుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పరిశ్రమల అభివృద్ధి అధికారి నరసింహారెడ్డి, జిల్లా లీడ్ బ్యాంకు అధికారి హరికృష్ణ జిల్లా విద్యాధికారి టి ప్రణీత తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat