Home / ANDHRAPRADESH / రేషన్‌ కార్డులపై జీసస్ అంటూ దుష్ప్రచారం…అడ్డంగా దొరికిపోయిన టీడీపీ..!

రేషన్‌ కార్డులపై జీసస్ అంటూ దుష్ప్రచారం…అడ్డంగా దొరికిపోయిన టీడీపీ..!

ఏపీలో గత కొద్ది రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌, పార్టనర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సహా టీడీపీ నేతలు మతం పేరుతో సీఎం జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల డిక్లరేషన్‌పై సంతకం , ఇంగ్లీష్ మీడియం పేరుతో మతమార్పిడులకు ప్రభుత్వం తెరతీసిందని, తిరుమల, విజయవాడలతో సహా రాష్ట్రంలో అన్యమత ప్రచారం జరుగుతుందని టీడీపీ, జనసేన పార్టీలు ఆరోపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ అయితే ఓ ముందడుగు వేసి సీఎం జగన్ మతం, కులంపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. తాజాగా మతం పేరుతో టీడీపీ చేస్తున్న కుట్ర రాజకీయం బట్టబయలైంది. తూర్పు గోదావరి జిల్లాలో రేషన్ కార్డులపై జీసస్ ఫోటో ముద్రించారంటూ…టీడీపీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం మొదలెట్టింది. రేషన్ కార్డులపై జీసస్ ఫోటో వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో అధికారులు ఈ ఘటనపై ఆరా తీయగా…చంద్రబాబు కుట్ర బట్టబయలైంది. ఈ వ్యవహారం తూగో జిల్లా పెద్దాపురం మండలం, వడ్లమూరులో వెలుగులోకి వచ్చింది. వల్లమూరుకు చెందిన మంగాదేవి రేషన్ డీలర్. ఈమె బాబుగారి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి..ఆమె భర్త స్థానిక టీడీపీ నాయకుడు. ప్రభుత్వాన్ని మతం పేరుతో బద్నాం చేయాలన్న చంద్రబాబు ఆదేశాల మేరకు సదరు టీడీపీ నాయకుడు.. తన భార్య రేషన్ షాపు పరిధిలోని కార్డులపై కావాలనే క్రీస్తు ఫోటో ముద్రించి…వాటిని వినియోగదారులకు అందించాడు. రేషన్ కోసం వచ్చిన వారు తమ కార్డులపై ఉన్న జీసస్ ఫోటో గురించి అడుగగా.. ప్రభుత్వమే ముద్రించినట్లు టీడీపీ నాయకుడు ప్రచారం చేస్తున్నాడంట..ఈ వ్యవహారం పౌర సరఫరా అధికారుల విచారణలో తేలింది. కాగా సదరు టీడీపీ నాయకుడు గతంలో 2016లో రేషన్ కార్డులపై సాయిబాబా ఫోటోను, 2017లో శ్రీ వేంకటేశ్వరస్వామి ఫోటోను ముద్రించాడు. అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండడంతో కేవలం ప్రభుత్వాన్ని మతం పేరుతో బద్నాం చేయాలన్న బాబు కుట్రలో భాగంగా ఇలా రేషన్ కార్డులపై క్రీస్తు ఫోటోను ముద్రించినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు రేషన్ కార్డులపై వెంటనే క్రీస్తు ఫోటోను తొలగించి, సదరు టీడీపీ నాయకుడుడు, అతని భార్యపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. మొత్తంగా మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి సీఎం జగన్‌పై, వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చంద్రబాబు చేస్తున్న కుట్ర బట్టబయలైంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat