Home / ANDHRAPRADESH / చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు వెళ్లి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అడిగితే ఏమన్నాడో తెలుసా.?

చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు వెళ్లి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అడిగితే ఏమన్నాడో తెలుసా.?

రెండోరోజు మంగళవారం శాసనసభ ప్రారంభమయ్యాక టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటం బాధనిపిస్తోందని, శాసనసభా వ్యవహారాలశాఖామంత్రికి చిన్నసూచన అని అచ్చెన్నాయుడు అన్నారు. దీంతో మంత్రి బుగ్గన కలగజేసుకొని.. రోజుకు ఒక్కసారి అయినా మీరు నాలెడ్జ్‌ తెచ్చుకోండి. నా సూచనలు వినండి అని అచ్చెన్నాయుడు అంటున్నారు. గత 5 సంవత్సరాలనుంచి సూచనలు అందరం విన్నామని, అందరికీ నాలెడ్జ్‌ ఉండాల్సినంత వరకు ఉందని బుగ్గన అన్నారు. సభలోకి రాగానే గౌరవ సభ్యులు వంశీ చేతులు ఎత్తారు. ఏంటి అని అన్నాను. అంతలోనే టీడీపీ వాళ్లు ఏదో ఊహించుకొని.. ప్రతిపక్ష నాయకుడుని తిట్టబోతున్నారు.. అనుకున్నారు.. వాళ్లు ఎందుకుపోయారో, ఎందుకు చిన్నగా లోపలికి ఎందుకు వచ్చారో వాళ్లకే తెల్సు అని..
చూసేలోపు ఒక్కొక్కరుగా లోపలికి వచ్చారని బుగ్గన అన్నారు. ఈ మాత్రానికి అక్కడే ఉండి రూల్స్‌ ప్రకారం అడగవచ్చు కదా అని టీడీపీ సభ్యులకు సూచించారు. గౌరవ సభ్యుడు వల్లభనేని వంశీ మాట్లాడిన ఐదు నిమిషాల్లో తను చదువుకున్నప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో ముఖ్యమంత్రి గారు తీసుకున్ననిర్ణయాలు బావున్నాయని.. నియోజకవర్గంలో కొన్ని విషయాలు మాట్లాడటానికి ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లాలని వంశీ తెలిపారని బుగ్గన అన్నారు. నిజానికి ఎప్పుడైనా ప్రభుత్వం, ముఖ్యమంత్రి అందరివాడు.. 2014 నుంచి ఈ పద్ధతి మారింది. 2014 వరకు ఏ ముఖ్యమంత్రి దగ్గరికి అయినా ఏ ఎమ్మెల్యే, ఏ ఎమ్మెల్సీ, రాజకీయ నాయకుడు కలిసేందుకు, నియోజకవర్గ పనులు, వ్యక్తిగత పనుల కోసమైనా వెళ్లేందుకు యాక్సెస్‌ ఉండేది. అయితే, 2016లో మొత్తం రాష్ట్రంలో ఉండే ప్రతి టీడీపీ శాసనసభ్యులకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇస్తూ.. ఆ తర్వాత ఎక్కడైతే టీడీపీ ఓడిపోయిందో.. అక్కడ టీడీపీ ఇంఛార్జిలకు ఇస్తుంటే.. 46 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబును వెళ్లి కలిస్తే డైరెక్ట్‌గా.. ఐవిల్‌ నాట్‌ అన్నారు. నేను ఇవ్వను అన్నారని చెప్పారు.
చివరకు, గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ అభివృద్ధి నిధులే కాకుండా చివరకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కూడా ఇవ్వలేదని బుగ్గన గుర్తుచేశారు. నియోజకవర్గంలో ఎవరో ఒక మనిషికి ఆరోగ్యం బాగోలేకనో, యాక్సిడెంట్‌ అయి.. దెబ్బతగిలి ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వచ్చి అడిగినా రూ.25-30 వేలు ఇవ్వలేదన్నారు. స్వయంగా మేమే బ్లాక్‌1కు వెళ్లి అడిగితే అక్కడ అధికారులు రూలింగ్‌ పార్టీ కాకుండా ఇతరులకు ఇవ్వవద్దని సూచనలు ఉన్నాయన్నారు.2019లో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎం అయ్యాక సీఎం డెవలప్‌ ఫండ్‌ టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వబడుతుందని చెప్పారని బుగ్గన గుర్తుచేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat