ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న ట్రెండ్ చూస్తే టాలీవుడ్ టాప్ హీరో ఎవరో చాలా తేలికగా చెప్పొచ్చు. ఇయర్ ఎండింగ్ వచ్చేసింది కాబట్టి ఎక్కడ చూసిన టాలీవుడ్ టాప్ హీరో కోసమే చర్చ జరుగుతుంది. అయితే ఇక ఆ టాప్ హీరో ఎవరూ అనే విషయానికి వస్తే అతడు తండ్రికి తగ్గ తనయుడు, తండ్రి వారసత్వానికి నిలువెత్తు నిదర్శనం అతడే గట్టమనేని మహేష్ బాబు. తన తండ్రి కృష్ణ కు ఏమాత్రం తీసిపోడని చెప్పాలి. అటు సినిమాల్లోనే కాదు ఇటు వ్యాపారపరంగా లేదా మానవత్వంలోను మహేష్ ని మించినవారు ఉండరు. సూపర్ స్టార్ కృష్ణ విషయానికి వస్తే దశాబ్దకాలంగా అంటే 10సంవత్సరాలు పాటుగా అతడే టాలీవుడ్ టాప్ హీరోగా ఉండడం అంటే మామోలు విషయం కాదు.
ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి అతడి స్థానాన్ని కైవశం చేసుకున్నాడు. అయితే చిరు రాజకీయాల్లో అడుగుపెట్టాక తమ్ముడు పవన్ కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు. అతడు కూడా రాజకీయాల్లోకి రావడంతో ఇంక బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వాళ్ళంతా సీనియర్లు కావడంతో మహేష్ ఆ స్థానాన్ని కైవశం చేసుకున్నాడు. ఆ తరువాత స్థానాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ గట్టిపోటీ ఇస్తున్నారు. మహేష్ 2019కి గాను ట్విట్టర్ లో దేశంలోనే టాప్ 9 లో ఉండడమే కాకుండా తెలుగు ఇండస్ట్రీ నుండి ఒక్కడిగా నిలిచాడు.