Home / ANDHRAPRADESH / ఏపీ అసెంబ్లీలో తండ్రి, కొడుకులను చెడుగుడు ఆడిన ఎమ్మెల్యే రోజా..!

ఏపీ అసెంబ్లీలో తండ్రి, కొడుకులను చెడుగుడు ఆడిన ఎమ్మెల్యే రోజా..!

ఏపీ అసెంబ్లీ శ్రీతాకాల సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు టీడీపీ విమర్శలకు కౌంటర్ ఇస్తూ…పంచ్‌ డైలాగులతో చంద్రబాబు, లోకేష్‌లపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా జబర్దస్త్ పంచ్‌డైలాగులతో తండ్రీ కొడుకులను చెడుగుడు ఆడేస్తోంది. తాజాగా అసెంబ్లీలో రోజా మాట్లాడుతూ…టీడీపీ నేతలు ఉదయాన్నే లేచి నారా లోకేశ్‌తో ప్రెస్‌మీట్ పెట్టించారు. ఆయన ప్రెస్‌మీట్‌ చూస్తే మంత్రుల కాళ్లు వణుకుతున్నాయంటూ..టీడీపీ నేతలు డబ్బా కొట్టుకుంటున్నారు…అవును..లోకేష్ ప్రెస్‌మీట్ చూసి నా కాళ్లు కూడా వణుకుతున్నాయి’అంటూ రోజా ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో మహిళల భద్రతపై జరిగిన చర్చ సందర్భంగా చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలంతా ఉల్లి ధరలపై చర్చించాలని ఆందోళన చేశారు. ఈ విషయంపై రోజా మాట్లాడుతూ..విదేశాలలో అమ్మాయిలతో తాగి తందనాలాడిన లోకేష్ ఫోటోలు, అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి..లేదా కడుపైనా చేయాలంటూ.. బాలయ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు బయటపడతాయనే మహిళ భద్రతపై జరుగుతున్న చర్చను చంద్రబాబు అడ్డుకున్నారని రోజా ఫైర్ అయ్యారు. తాను పోటీ చేసిన మంగళగిరి పేరు‌ను సరిగా పలకడానికి ట్యూషన్ పెట్టించుకున్న మందమతి..లోకేష్ అని పంచ్ వేశారు. ఆఖరకు జయంతి, వర్థంతికి తేడా కూడా లోకేష్‌కు తెలియదంటూ సెటైర్ వేశారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గట్టిగట్టిగా అరుస్తున్నారు..కాని గట్టిగట్టిగా అరిస్తే..గడ్డిపరిక సింహం కాలేదని గుర్తుపెట్టుకోవాలని రోజా అన్నారు. గతంలో ఇదే అసెంబ్లీలో  బోండా ఉమ నిండు సభలో పాతేస్తా..నరికేస్తానని అన్నాడు..శాసనసభ్యులు గౌరవంగా ప్రజల చేత గెలిపించబడి అసెంబ్లీకి వచ్చి..వారి సమస్యల గురించి మేము పోరాడుతుంటే..మమ్మల్ని పాతిపెడతానంటే ఆ రోజు ఏమైంది ఈ చంద్రబాబు బుద్ధి..ఈయన ఫ్రతిపక్ష నాయకుడా..పనికిమాలిన నాయకుడా అంటూ రోజా మండిపడ్డారు. ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటే బాబు అడ్డుపుడుతున్నారని విమర్శించారు. సీఎం జగన్‌ను అభినందించకపోయినా ఫర్వాలేదు..కాని ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని రోజా అన్నారు. ఇక 151 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి రండి..సమాధానం చెబుతానని చంద్రబాబు మగధీర సినిమా డైలాగులు కొడుతున్నారని వెటకారం ఆడారు. పాపం బాబుకు వయసు తో పాటుగా చాదస్తం పెరిగిపోయిందని.. ఆయన్ను ఆస్పత్రిలో చూపించి, ట్రీట్‌మెంట్ ఇప్పించాలని రోజా అన్నారు. మొత్తంగా అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే రోజా జబర్దస్ పంచ్ డైలాగులతో చంద్రబాబు, లోకేష్‌ల‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat