Home / ANDHRAPRADESH / బాలయ్యను తొక్కేస్తున్న చంద్రబాబు..వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ‌్యలు..!

బాలయ్యను తొక్కేస్తున్న చంద్రబాబు..వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ‌్యలు..!

వెన్నుపోటు అనగానే టీడీపీ అధినేత చంద్రబాబే గుర్తుకువస్తారు. అధికారం కోసం పిల్లనిచ్చిన మామ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కున్నాడు. అయితే తెలివిగా లక్ష్మీ పార్వతిని బూచిగా చూపించి …స్వయానా ఎన్టీఆర్ కుమారులే..తన వెన్నుపోటుకు సహకరించేలా చక్రం తిప్పాడు. ఆ తర్వాత క్రమంగా నందమూరి కుటుంబస‌భ్యులను పార్టీ నుంచి దూరం చేశాడు. వాడుకుని వదిలేయడంలో దిట్ట అయిన చంద్రబాబు తన కొడుకు లోకేష్‌కు బాలయ్య బిడ్డనిచ్చి వివాహం జరిపించాడు. తద్వారా భవిష్యత్తులో తన సీఎం సీటుకు ఎసరు రాకుండా బాలయ్యను కట్టడి చేశాడు. ఇక ఇప్పుడు తన వారసుడిగా లోకేష్‌ను భవిష్యత్తులో సీఎంగా చేయాలనుకున్నంటున్న చంద్రబాబు.. జూనియర్ ఎన్టీఆర్‌‌తో ఇబ్బంది లేకుండా బాలయ్యను ముందుపెట్టి..నందమూరి కుటుంబంలో చిచ్చుపెడుతున్నాడు. తన అన్న కొడుకు ఎన్టీఆర్ కంటే తన అల్లుడు లోకేష్‌కే బాలయ్య సపోర్ట్ చేయాల్సిన పరిస్థితిని తీసుకువచ్చాడు. అలాగే బాలయ్యకు హిందూపురం ఎమ్మెల్యే సీటునిచ్చినా..పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేకుండా చేశాడు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా బాలయ్యను చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో రోజా మాట్లాడుతూ..చంద్రబాబు స్వయానా తన బావమరిది వియ్యంకుడు అయిన నందమూరి బాలకృష్ణకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు కళాకారులకు తీరని అన్యాయం చేస్తున్నారని అందులో భాగంగానే హిందూపూర్ నుంచి శాసనసభ కు ఎన్నికైన నటుడు నందమూరి బాలకృష్ణకు సభలో మాట్లాడే అవకాశం చంద్రబాబు ఇవ్వడం లేదని రోజా ఆరోపించారు. తన అనుచర వర్గాన్ని ప్రభుత్వంపైనా అధికార పార్టీ ఎమ్మెల్యేలపైనా ఉసి గొల్పుతున్న చంద్రబాబు.. బాలకృష్ణ లాంటి కళాకారులకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోవడం విడ్డూరంగా వుందని రోజా అన్నారు. కాగా సీఎం కుర్చీ కోసం సొంత మామకే వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారకుడు అయిన చంద్రబాబు అదే కుర్చీ భవిష్యత్తులో కూడా నారా కుటుంబానికి కాకుండా నందమూరి కుటుంబానికి దక్కకూడదనే కుట్రతోనే ఇటు బాలయ్యను, అటు జూనియర్ ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నాడని…ఇందులో విడ్డూరం ఏముందని టీడీపీ ఎమ్మెల్యేలే గుగులాడుకుంటున్నారు. మొత్తంగా బాలయ్యకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు టీడీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat