Home / ANDHRAPRADESH / మార్షల్స్‌పై అనుచిత ప్రవర్తన..అడ్డంగా బుక్కైన చంద్రబాబు..!

మార్షల్స్‌పై అనుచిత ప్రవర్తన..అడ్డంగా బుక్కైన చంద్రబాబు..!

టీడీపీ అధినేత చంద్రబాబు పొద్దున లేస్తే 40 ఇయర్స్ ఇండస్ట్రీ, దేశంలో నాకంటే సీనియర్ నాయకుడు లేరంటూ గొప్పలు చెప్పుకుంటాడు. 14 ఏళ్లు సీఎంగా, 10 ఏళ్లు ప్రతిపక్షనేతగా పని చేశారు. ప్రస్తుతం ముచ్చటగా మూడోసారి ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తున్నారు. అలాంటి బాబుగారికి అసెంబ్లీలో నియమనిబంధనలు తెలియవా.. కొన్ని ఎల్లోమీడియా ఛానళ్ల అసత్యకథనాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 2430 పై చంద్రబాబు రాద్ధాంతాం చేస్తున్నారు. ఈ మేరకు నిన్న అసెంబ్లీ గేటు వద్ద బాబు, లోకేష్‌, టీడీపీ ఎమ్మెల్యేలు, మరి కొంతమంది నేతలపై కలిసి ర్యాలీగా అసెంబ్లీ గేటు వరకు వచ్చారు. అయితే మామూలుగా ప్రతిపక్షనేతకు కేటాయించిన 2 వ నెంబర్ గేటు నుంచి కాకుండా ఎమ్మెల్యేలు వచ్చే మరో గేటు నుంచి రావడంతో మార్షల్స్ అడ్డుకుని, రెగ్యులర్‌గా వచ్చే గేటు నుంచే రావాలని సూచించారు. దీంతో సహనం కోల్పోయిన చంద్రబాబు, లోకేష్‌లు బాస్టర్డ్స్, యూజ్‌లెస్ ఫెలోస్, డోర్లు తీయండ్రా అంటూ తిడుతూ మార్షల్స్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. మార్షల్స్ పట్ల చంద్రబాబు, లోకేష్‌ల ప్రవర్తనపై మంత్రి బుగ్గన తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి అంబటి రాంబాబు, జక్కంపూడి రాజా తదితర ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. అయితే అసెంబ్లీకి వచ్చిన చంద్రబాబు ఈ ఘటనలో మార్షల్స్‌కు క్షమాపణ చెప్పేది లేదని…నాకే అవమానం జరిగింది కాబట్టి..ప్రభుత్వమే దానికి క్షమాపణ చెప్పాలని ఖరాకండిగా చెప్పేశాడు. అంతే కాదు ప్రభుత్వంపై ఏకంగా సభాహక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చాడు. చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ సర్కార్..మార్షల్స్‌ను దూషించిన ఘటనలో ఆయనపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుంది. చంద్రబాబుకు కావాల్సింది అదే..ప్రభుత్వం చర్యలు తీసుకుంటే..అదిగో నన్ను అసెంబ్లీలో మాట్లాడకుండా గొంతు నొక్కేస్తున్నారు…నన్ను చూసి భయపడే నన్ను అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటున్నారంటూ సింపతీ ప్లే చేస్తాడు. తద్వారా ప్రజల్లో తనకు సానుభూతి…ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని బాబుగారి ఆలోచన.. అసెంబ్లీలో ఎంత రచ్చ చేస్తే..తనకు అంత మైలేజీ వస్తుందని బాబుకు తెలుసు. అందుకే..ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేసి, ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే పనిలో పడ్డాడు…ఒక వేళ ప్రభుత్వం తనపై కఠిన చర్యలు తీసుకుంటే..సింపతీ, పబ్లిసిటీ రెండూ వర్కవుట్ అవుతాయని బాబుగారి మాస్టర్ బుర్రకు తట్టింది. అందుకే తనకు కేటాయించిన గేటు నుంచి కాకుండా మరో గేటు నుంచి వచ్చి వివాదం రాజేసి…దాంట్లో చలి కాచుకుంటున్నాడు. అయినా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన బాబుగారికి అసెంబ్లీ‌లో, ఏ గేటు నుంచి రావాలో తెలియదా.. అంతా పబ్లిసిటీ పిచ్చి కాకపోతే..అంటున్నారు వైసీపీ నేతలు… మొత్తంగా మార్షల్స్‌ను దూషించిన ఘటనలో చంద్రబాబు అడ్డంగా ఇరుక్కున్నాడనే చెప్పాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat